లండన్: 2023 వింబుల్డన్ మహిళల ఛాంపియన్, చెక్ రిపబ్లిక్‌కు చెందిన మార్కెటా వోండ్రుసోవాపై యాంటీ డోపింగ్ ఏజెన్సీ(వాడా) నాలుగేళ్ల నిషేధం విధించింది. వోండ్రుసోవా డోపింగ్ పరీక్షలను నిరాకరించడమే ఇందుకు ప్రధాన కారణం. ఒక స్వతంత్ర ట్రిబ్యునల్ వాదనలను, డోపింగ్ పరిక్షలు నిర్వహించే అధికారి సాక్ష్యాన్ని పరిశీలించి ఈ నిర్ణయాన్ని వెలువరించింది. వోండ్రుసోవా డోపింగ్ పరీక్షలకు దూరంగా ఉండడానికి గల కారణాలను తెలపడంలో విఫలమైందని అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య(ఎటిపి) దీనిని సమర్థించింది. “పరీక్షల ప్రక్రియ అసౌకర్యంగా ఉందని, ఇప్పటికే అధిక ఒత్తిడి, నిశిత పరిశీలనతో కూడిన ఉద్యోగాలు చేస్తున్న ఆటగాళ్లకు ఇది అదనపు భారం అని కూడా తెలిసినా.. కానీ, నిష్పక్షపాతమైన పోటీని పరిరక్షించడానికి ఇది అత్యవసరం’’ ఎటిపి తాజా ప్రకటనలో పేర్కొంది. ఇక 26ఏళ్ల వోండ్రుసోవా గత కొన్ని నెలలుగా మానసిక, తీవ్ర ఒత్తిడి సమస్యలతో బాధపడుతోంది. ఇక 26 ఏళ్ల వొండ్రూసోవా నిషేధంపై స్పందిస్తూ.. ఈ విషయం గురించి మాట్లాడటం కష్టంగా ఉంది, కానీ నా మానసిక ఆరోగ్యం గురించి పారదర్శకంగా ఉండాలనుకుంటున్నాను.. చాలా కాలంగా గాయాలు, నిరంతర ఒత్తిడి మరియు నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నాను. వాటివల్ల నేను అలసిపోయి, బలహీనంగా మారిపోయాను`` అని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది.
Print Edition2023 వింబుల్డన్ ఛాంపియన్.. వోండ్రుసోవాపై నాలుగేళ్ల నిషేధం
2 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 23, 2026, 12:27 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)