పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ 2026 మహిళల బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఓటమి పాలైంది. ప్రపంచ నంబర్‌వన్, దక్షిణ కొరియా షట్లర్ ఆన్ సె యంగ్ చేతిలో పరాజయం చవిచూసింది. తొలి గేమ్‌లో 21-16తో విజయం సాధించిన సింధు, తర్వాతి రెండు గేమ్‌లలో 11-21, 12-21తో ఓడిపోయింది. దీంతో ఆన్ సె యంగ్ వరుసగా మూడోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇప్పటివరకు వీరిద్దరూ 11 సార్లు తలపడగా, అన్ని మ్యాచ్‌ల్లోనూ సింధు ఓటమి పాలవడం గమనార్హం.
French Open: ఫైనల్లో పీవీ సింధు ఓటమి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 25, 2026, 05:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)