సోమవారం, 31 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionహాకీ జట్టుకు సెమీస్‌ బెర్త్‌ చేజారే...

22 ఆగస్టు, 2026

21india-hockey2.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 23, 2026, 04:48 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • కీలక పోరులో నెదర్లాండ్స్‌ ‌చేతిలో ఓటమి

  • సెమీస్‌‌కు ఆతిథ్య జట్టు

ఆమ్‌‌స్టెల్‌‌వీన్‌(‌‌నెదర్లాండ్స్‌): ఎఫ్‌ఐహెచ్‌ ‌హాకీ ప్రపంచకప్‌‌లో భారత పురుషుల జట్టూ ఓటమిపాలైంది. అమ్మాయిలు ఆతిథ్య నెదర్లాండ్స్‌ ‌చేతిలో 2-0తో ఓటమిపాలైతే.. శనివారం జరిగిన కీలక పోరులో భారత పురుషుల జట్టు 3-1తో నెదర్లాండ్స్‌ ‌చేతిలో పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్‌‌లో గెలిస్తేనే సెమీస్‌ ‌రేసులో నిలవడం ఖాయం అనుకున్న దశలో తొలి రెండు క్వార్టర్‌‌లు ముగిసేసరికి ఇరుజట్లు గోల్స్‌ ‌చేయలేదు. దీంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి 0-0తో సమానంగా ఉంది. కానీ మూడో క్వార్టర్‌‌ 41వ ని.లో డూకో కాంప్‌ ‌గోల్‌ ‌చేయడంలో నెదర్లాండ్స్‌ 1-0 ఆధిక్యతలోకి దూసుకెళ్లింది. ఇక నాల్గో, చివరి క్వార్టర్‌‌ 51వ ని.లో హెడ్‌‌మేకర్స్‌ ‌గోల్‌ ‌చేయడంతో నెదర్లాండ్స్‌ 2-0 ఆధిక్యతలో నిలిచింది. ఆ తర్వాత భారతజట్టు కెప్టెన్‌ హర్మన్‌‌ప్రీత్‌ 52వ ని.లో గోల్‌ ‌చేయడంలో నెదర్లాండ్స్‌ ఆధిక్యత 2-1కి తగ్గినా.. ఆతిథ్య జట్టు తరఫున థిజ్‌ ‌వాండామ్‌ 55వ ని.లో గోల్‌ చేయడంలో 3-1 ఆధిక్యతలోకి దూసుకెళ్లింది. చివరి 5 నిమిషాల్లో ఏ జట్టూ గోల్‌ ‌చేయలేదు. దీంతో నెదర్లాండ్స్‌ 3-1తో ఇండియాను ఓడించి పూల్‌-ఇలో 6పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి సెమీస్‌‌కు చేరింది. 24(సోమ)న జరిగే చివరి లీగ్‌ ‌మ్యాచ్‌‌లో భారత పురుషుల జట్టు అర్జెంటీనాతో తలపడనుంది. శనివారం జరిగే మరో మ్యాచ్‌‌లో అర్జెంటీనాను ఇంగ్లాండ్‌ ‌ఓడిస్తే.. భారతజట్టు సెమీస్‌‌ రేసు నుంచి నిష్ర్కమిస్తుంది. పూల్‌-ఎఫ్‌‌లో శనివారం ఆస్ట్రేలియా-బెల్జియం జట్ల మధ్య ​జరిగిన మరో మ్యాచ్‌ 1-1‌తో డ్రా అయ్యింది. దీంతో ఈ పూల్‌‌లో ఆస్ట్రేలియా 4పాయింట్లతో అగ్రస్థానంలో నిలువగా.. స్పెయిన్‌, జర్మనీ 3పాయింట్లతో 2, 3 స్థానాల్లో ఉన్నాయి. ఇక ఆతిథ్య బెల్జియం 2మ్యాచుల్లో 1పాయింట్‌‌తో అట్టడుగు స్థానంలో ఉంది. రెండోరౌండ్‌ ‌చివరి పూల్‌ మ్యాచ్‌‌లో జర్మనీతో ఆస్ట్రేలియా, స్పెయిన్‌‌తో బెల్జియం తలపడనున్నాయి. ఇతర వర్గీకరణ మ్యాచుల్లో పాకిస్తాన్‌ 4-3తో జపాన్‌‌ను, స్కాట్లాండ్‌ 2-1తో ఐర్లాండ్‌‌ను, న్యూజిలాండ్‌ ‌జట్టు 7-2తో వేల్స్‌‌ను ఓడించాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్