ఫిఫా : ఫిఫా ప్రపంచకప్ 2026లో పరాగ్వే జట్టు ఒకవైపు కీలక విజయాన్ని నమోదు చేయగా, మరోవైపు అరుదైన అవాంఛిత రికార్డును కూడా సొంతం చేసుకుంది. తుర్కియేతో జరిగిన గ్రూప్-డి మ్యాచ్‌లో పరాగ్వే 1-0 తేడాతో గెలిచి నాకౌట్ దశ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఫిఫా అమలు చేస్తున్న కొత్త నిబంధనలు చర్చనీయాంశంగా మారాయి. మైదానంలో ఆటగాళ్లు తమ నోటిని చేతితో మూసుకొని ప్రత్యర్థులతో మాట్లాడితే దానిపై కూడా రిఫరీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పరాగ్వే స్టార్ ఆటగాడు మిగెల్ అల్మిరన్ అలాంటి చర్యకే బలయ్యాడు. ప్రత్యర్థి ఆటగాడితో మాట్లాడేటప్పుడు నోటిని చేతితో మూసుకున్నాడన్న కారణంతో రిఫరీ అతనికి నేరుగా రెడ్ కార్డు చూపించాడు. దీంతో ప్రపంచకప్ చరిత్రలో ఈ నూతన నిబంధన కింద రెడ్ కార్డు అందుకున్న తొలి ఆటగాడిగా మిగెల్ అల్మిరన్ నిలిచాడు. ఇదే టోర్నమెంట్‌లో నమోదైన నాలుగో రెడ్ కార్డు కూడా కావడం విశేషం. ఇదిలా ఉండగా, పరాగ్వేకు చెందిన మతియాస్ గాలర్జా మరో ప్రత్యేక రికార్డును సృష్టించాడు. మ్యాచ్ ప్రారంభమైన కేవలం 64 సెకన్లకే గోల్ సాధించి ప్రపంచకప్ 2026లో అత్యంత వేగంగా గోల్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు మొరాకో ఆటగాడు ఏడో నిమిషంలో చేసిన గోల్ వేగవంతమైనదిగా ఉండగా, గాలర్జా ఆ రికార్డును అధిగమించాడు. అతని అద్భుత ప్రదర్శనకు గుర్తింపుగా 'సుపీరియర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు కూడా లభించింది.
FIFA - ప్రపంచకప్‌లో కొత్త రూల్ ఎఫెక్ట్ .. ఆటగాడికి రెడ్ కార్డు ..!
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 20, 2026, 02:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)