mh ad
శనివారం, 20 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

"IND v AFG : టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్.. ముందుగా బ్యాటింగ్"

4 గంటల క్రితం

IND vs AFG: Afghanistan wins toss, elects to bat first.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 20, 2026, 01:28 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం


ఇంటర్నెట్ డెస్క్‌: అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత పేసర్ ప్రసిద్ధ్‌ కృష్ణ చెలరేగుతున్నాడు. రహ్మనుల్లా గుర్బాజ్ (5), ఇబ్రహీం జద్రాన్ (11), రహ్మత్ షా (5), డార్విష్‌ రసూలీ (1)ని పెవిలియన్‌కు పంపాడు. 10 ఓవర్లు ముగిసేసరికి అఫ్గాన్ స్కోరు 36/4. ప్రస్తుతం క్రీజులో అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (0), హష్మతుల్లా షాహిది (4) ఉన్నారు.


చెన్నై : భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న మూడో, చివరి వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో విజయం సాధించిన భారత్ సిరీస్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు భారత జట్టులో మూడు మార్పులు చేశారు. ప్రసిద్ధ్ కృష్ణ, హర్ష్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డికి తుది జట్టులో చోటు కల్పించారు. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ కూడా తన జట్టులో నాలుగు మార్పులు చేసింది. సిరీస్‌ను ఇప్పటికే ఖరారు చేసుకున్న శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు.. చివరి వన్డేలోనూ విజయం సాధించి ఆఫ్ఘనిస్తాన్‌పై క్లీన్‌స్వీప్ నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు పరువు నిలబెట్టుకునే విజయంపై ఆఫ్ఘనిస్తాన్ దృష్టి సారించింది.


టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ ... తాము టాస్ గెలిచినా మొదట బ్యాటింగే తీసుకునేవాళ్లమని, చెన్నైలో ఎండ విపరీతంగా ఉన్నందున టాస్ అంత కీలకం కాదన్నారు. ఈ సిరీస్‌లో భారత్ ఇంకా ఛేజింగ్ చేయలేదు కాబట్టి, మూడో మ్యాచ్‌లో టార్గెట్‌ను ఛేజ్ చేసి గెలవడం తమకు ఒక మంచి పరీక్ష అని గిల్ పేర్కొన్నారు. సిరీస్ ఆల్రెడీ చేతిలో ఉండటంతో భారత్ ఈ మ్యాచ్‌లో మూడు కీలక మార్పులు చేసింది. ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ, ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబేలను తుది జట్టులోకి తీసుకొచ్చారు.


ఇరు జట్లు ....


ఆఫ్ఘనిస్తాన్ : రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), దర్విష్ రసూలీ, మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, AM ఘజన్‌ఫర్, జియా ఉర్ రహ్మాన్ షరీఫీ, మలీక్ ఫరీద్


భారత్ : యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్