శుక్రవారం, 24 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

IND vs AFG : మ్యాచ్ లన్నీ భారత్ లోనే .. ఆతిథ్యం మాత్రం ఆఫ్ఘనిస్థాన్‌ది ..!

1 గంట క్రితం

IND vs AFG: The match is being played in our country... yet Afghanistan is the host. Now, that is a real twist.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 24, 2026, 01:10 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • టి 20 సిరీస్‌కు బిసిసిఐ వినూత్న నిర్ణయం.. ఆసియా క్రీడల సన్నాహకంగా మూడు మ్యాచ్‌లు


న్యూఢిల్లీ : ఆసియా క్రీడలు–2026కు భారత పురుషుల క్రికెట్ జట్టును సిద్ధం చేసే క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) వినూత్న నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్‌లో భారత్–అఫ్గానిస్థాన్ మధ్య మూడు టి 20 అంతర్జాతీయ మ్యాచ్‌ల సిరీస్‌ను నిర్వహించనుంది. అయితే ఈ సిరీస్‌కు ప్రత్యేకత ఏమిటంటే.. మ్యాచ్‌లు న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగినప్పటికీ, అధికారిక ఆతిథ్య జట్టుగా అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డే వ్యవహరించనుంది. భారత గడ్డపై భారత్‌తో జరిగే ద్వైపాక్షిక సిరీస్‌కు ప్రత్యర్థి జట్టే ఆతిథ్యం వహించడం అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి..!


ఢిల్లీలోనే మూడు టి 20లు ...

ESPNcricinfo, ఇతర క్రీడా మాధ్యమాల కథనాల ప్రకారం ... ఈ సిరీస్‌లోని మూడు టి 20 మ్యాచ్‌లు సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో (లేదా 13, 16, 19 తేదీల్లో) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనున్నాయి. ఆఫ్గానిస్థాన్‌లో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, భద్రతా సమస్యలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ దేశ జట్టు గతంలో డెహ్రాడూన్, గ్రేటర్ నోయిడా, లక్నో వంటి భారత వేదికలను తమ హోమ్ గ్రౌండ్‌లుగా వినియోగించింది. ఈసారి బిసిసిఐ, ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు మధ్య కుదిరిన ఒప్పందం మేరకు అరుణ్ జైట్లీ స్టేడియాన్ని ఆఫ్ఘనిస్తాన్ హోమ్ వేదికగా ఉపయోగించుకోనుంది. ఇందుకు అనుగుణంగా ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) స్థానిక టోర్నీల షెడ్యూల్‌లో మార్పులు చేస్తోంది.


ఆసియా క్రీడలకు సన్నాహకంగా ....

జపాన్ వేదికగా సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 1 వరకు ఆసియా క్రీడల పురుషుల క్రికెట్ పోటీలు జరగనున్నాయి. వాటికి వారం రోజుల ముందే ఈ టి 20 సిరీస్ నిర్వహించనుండటంతో భారత యువ జట్టుకు ఇది కీలక సన్నాహకంగా మారనుంది. అంతకుముందు భారత్ ఆగస్టు చివరి వరకు శ్రీలంక పర్యటనలో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో టీ20 సిరీస్‌లలో ఎదురైన పరాజయాల తర్వాత అఫ్గానిస్థాన్‌తో జరిగే సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చాలని భారత జట్టు లక్ష్యంగా పెట్టుకుంది.


ఆసియా క్రీడల జట్టు ఇదే ....

ఆసియా క్రీడల కోసం బిసిసిఐ ఇప్పటికే శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా, తిలక్ వర్మను వైస్ కెప్టెన్‌గా నియమిస్తూ 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. జట్టులో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్లు), అభిషేక్ శర్మ, శివం దూబే, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, 15 ఏళ్ల యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి చోటు కల్పించింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్