న్యూఢిల్లీ : డెంగ్యూ నివారణకు ఉద్దేశించిన ’క్యూడెంగా’ టీకా మార్కెటింగ్‌కి ఔషధ రంగ నియంత్రణ సంస్థ డిసిజిఐ అనుమతులు లభించినట్లు టకెడా బయోఫార్మా ఇండియా వెల్లడించింది. డెంగ్యూకి సంబంధించి భారతదేశంలో ఆమోదం లభించిన ఈ తొలి టీకాను, 4 నుండి 60 ఏళ్ల వయస్సు గలవారు తీసుకోవచ్చు. 2022లో ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ వేక్సిన్‌కి 43 దేశాల్లో ఆమోదం లభించిందని, అంతర్జాతీయంగా 3.2 కోట్ల డోస్‌లు సరఫరా అయ్యాయని టకెడా ఇంటర్‌కాంటినెంటల్ మార్కెట్స్ విభాగం హెడ్ మహేందర్ నాయక్ తెలిపారు. తమ గ్లోబల్ క్లినికల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం ఫలితాల ఆధారంగా భారత్ లో దీనికి ఆమోదం లభించినట్లు వివరించారు. దోమల ద్వారా వ్యాప్తి చెందే ఈ వైరల్ వ్యాధి 125 దేశాల్లో ఉంది. మొత్తం కేసుల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. ఇప్పటికే దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ నివారణకుగాను ... ఈ తొలి డెంగీ వ్యాక్సిన్ ను భారతదేశం అందుబాటులోకి తెచ్చింది. జపాన్‌కు చెందిన టకేడా బయోఫార్మాస్యూటికల్స్ అభివృద్ధి చేసిన క్యూడెంగా (QDENGA) వ్యాక్సిన్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) మార్కెట్ అనుమతిని మంజూరు చేసింది. డీసీజీఐ గ్రీన్ సిగ్నల్‌తో కేంద్ర ప్రభుత్వం ఈ వ్యాక్సిన్‌కు ఆమోదం తెలిపింది. డెంగీకి కారణమయ్యే 4 రకాల వైరస్ల నుంచి ఈ వ్యాక్సిన్ రక్షణ కల్పిస్తుంది. 4 నుంచి 60 సంవత్సరాల వయస్సు వారు ఈ టీకా వేసుకోవచ్చు. గతంలో డెంగ్యూ సోకిందా లేదా అన్న దానితో సంబంధం లేకుండా బ్లడ్ టెస్ట్ వంటి పరీక్షలు లేకుండానే ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. 0.5 ఎంఎల్ చొప్పున మూడు నెలల వ్యవధిలో రెండుసార్లు ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. తాజాగా భారత్‌లో ఆమోదం పొందిన క్యూడెంగా వ్యాక్సిన్ ఆసియా ఖండంలోని 43 దేశాల్లో ఇప్పటికే ఆమోదం పొందింది. క్లినికల్ ట్రయల్స్‌లో డెంగ్యూ వల్ల ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితిని 84.1% వరకు ఈ వ్యాక్సిన్ నిరోధించినట్లు తేలింది. భారతదేశంలో డెంగ్యూ ఏటా తీవ్రమైన ప్రజా ఆరోగ్య సమస్యగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యే డెంగ్యూ కేసుల్లో దాదాపు మూడో వంతు కేసులు ఒక్క ఇండియాలోనే నమోదు అవుతున్నాయని అంచనా. 2025లో సుమారు లక్షకు పైగా కేసులు నమోదు కాగా.. నమోదు కాని సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందనేది సమాచారం. ఈ నేపథ్యంలో ... దేశంలో తొలి డెంగ్యూ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో భారత్‌లో డెంగ్యూ నివారణలో ఒక చారిత్రాత్మక ముందడుగు పడినట్లు అయ్యింది.
'Qdenga' - డెంగ్యూ టీకాను తీసుకోవచ్చు : డిసిజిఐ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 24, 2026, 01:29 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)