సోమవారం, 16 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Japan Masters : లక్ష్యసేన్‌ సంచలనం..

18 గంటల క్రితం

వరుసగా రెండో టైటిల్‌ కైవసం!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026, 11:34 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • వరుసగా రెండో టైటిల్‌ కైవసం

జపాన్‌: భారత యువ బ్యాడ్మింటన్‌ స్టార్‌ లక్ష్యసేన్‌ అద్భుత ప్రదర్శనతో మరో టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. జపాన్‌ మాస్టర్స్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 టోర్నీలో విజేతగా నిలిచాడు. ఇటీవల హైలో ఓపెన్‌ టైటిల్‌ సాధించిన లక్ష్యసేన్‌.. తాజాగా జపాన్‌ మాస్టర్స్‌ టైటిల్‌తో వరుసగా రెండో విజయాన్ని అందుకున్నాడు.

జపాన్‌ షట్లర్‌ కొకి వతనబెతో జరిగిన ఫైనల్‌ పోరు హోరాహోరీగా సాగింది. తొలి గేమ్‌లో 13-21తో ఓటమి చవిచూసిన లక్ష్యసేన్‌ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్నాడు. రెండో గేమ్‌లో 21-18తో, మూడో గేమ్‌లో 21-14తో విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.

ఈ విజయంతో జపాన్‌ మాస్టర్స్‌ టైటిల్‌ సాధించిన తొలి భారత ఆటగాడిగా లక్ష్యసేన్‌ చరిత్ర సృష్టించాడు. వరుసగా రెండు బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ టైటిళ్లు సాధించి తన సత్తా చాటాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్