టోక్యో: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు జపాన్ ఓపెన్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచి మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఆతిథ్య జపాన్‌కు చెందిన స్టార్ క్రీడాకారిణి అకానే యమగుచిపై వరుస సెట్లలో విజయం సాధించింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన సింధు, ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 21-17, 21-17 స్కోరుతో యమగుచిని ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.
ఈ విజయంతో పీవీ సింధు జపాన్ ఓపెన్ సూపర్-750 టైటిల్‌ను గెలిచిన తొలి భారత మహిళా షట్లర్‌గా చరిత్ర సృష్టించింది.








కామెంట్‌లు (0)