ఆదివారం, 19 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆగస్టు 3 వరకు నేతలు గాంధీభవన్ ‌కు రావొద్దు : సిఎం రేవంత్‌ రెడ్డి

8 గంటల క్రితం

ఆగస్టు 3 వరకు నేతలు గాంధీభవన్ ‌కు రావొద్దు : సిఎం రేవంత్‌ రెడ్డి
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 19, 2026, 01:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తెలంగాణ : పదవుల కోసం గాంధీ భవన్‌కు వచ్చే వారికి అపాయింట్‌మెంట్లు ఇవ్వొద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పార్టీ ముఖ్య నేతలకు సూచించారు. సర్‌ పై నిర్వహించిన జూమ్‌ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రేపటి నుంచి ఆగస్టు 3 వరకు నేతలు గాంధీభవన్ ‌కు రావొద్దన్నారు. కొందరు నేతలు హైదరాబాద్‌లో కూర్చొని పనిచేయట్లేదని అసహనం వ్యక్తం చేశారు. ఎస్‌ఐఆర్‌ గడువు ఆగస్టు 3 వరకు పొడిగించారని, ఇన్‌ఛార్జి మంత్రులు అన్ని జిల్లాల్లో సర్‌పై సమీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ‘‘ 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సర్‌పై 489 భేటీలు జరిగాయి. వెనుకబడిన నియోజకవర్గాల్లో నేతలు ఇప్పటికైనా స్పందించాలి. ఛైర్మన్‌ పదవులు, పార్టీ పోస్టులు కావాలని గాంధీభవన్‌ చుట్టూ తిరగొద్దు. పదవుల కోసం వచ్చే వారికి గాంధీభవన్‌లో అపాయింట్‌మెంట్లు ఇవ్వొద్దు. ఎంపి లు పార్లమెంట్‌ సమావేశాల్లో ఉన్నా ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలి. ఇన్‌ఛార్జిలుగా ఉన్న చోట ఎంపీలు పనిచేయకపోతే కఠినంగా వ్యవహరిస్తాం. పార్టీ పరంగా సర్‌ ఇన్‌ఛార్జిలుగా ఉన్న వారు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలి. బీఎల్‌వోల నివేదికల కంటే బీఎల్‌ఏ ల రిపోర్టులను పరిశీలించాలి. బిఎల్‌వోల రిపోర్టులపై మాత్రమే ఆధారపడితే కఠిన చర్యలు ఉంటాయి. పార్టీ పరంగా పనిచేస్తున్న బీఎల్‌ఏలను నేతలు సమర్థంగా ఉపయోగించాలి. పూర్తగా క్షేత్రస్థాయిలో ఉండాలి.. హైదరాబాద్‌ చుట్టూ తిరుగుతామంటే కుదరదు. వచ్చే 10 రోజులు ఎన్నికల ప్రచారం తరహాలో నియోజకవర్గాల్లో పర్యటించాలి. సర్‌కు నియమించిన పార్టీ ఇన్‌ఛార్జిలు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందే. ఈనెల 30న మళ్లీ పూర్తిస్థాయి సమీక్ష నిర్వహిస్తాం. పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క మరింత బాధ్యత తీసుకుని సమన్వయం చేయాలి. బాగా పనిచేసే 100 మంది బీఎల్‌ఏలకు రాహుల్‌ గాంధీతో ఫొటో దిగే అవకాశం ఉంటుంది ’’ అని సిఎం తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్