టోక్యో: జపాన్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లోకి కిదాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్ దూసుకెళ్లారు. బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో 8వ ర్యాంకర్ లక్ష్యసేన్ 21-19, 21-18తో చైనీస్ తైపీకి చెందిన ఛి-యు-జెన్‌ను 49 నిమిషాల్లో చిత్తుచేశాడు. తొలి గేమ్‌లో 14-10 ఆధిక్యతలో నిలిచిన లక్ష్యసేన్.. ఆ తర్వాత 16-12తో ఆధిక్యతలో నిలిచాడు. ఆ తర్వాత 16-16స్కోర్‌తో సమం కాగా.. లక్ష్యసేన్ అద్భుతంగా పుంజుకొన్నాడు. ఇక రెండో గేమ్‌లోనూ ఇరువురు 19-18పాయింట్లతో ఉన్న దశలో లక్ష్యసేన్ వరుసగా రెండు పాయింట్లు కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. కిదాంబి శ్రీకాంత్ 18-21తో తొలి గేమ్‌ను కోల్పోయినా.. ఆ తర్వాతర్వాత 21-16, 24-22తో డెన్మార్క్ కు చెందిన రాస్మస్ జెంకేను చిత్తుచేశాడు.
Kumamoto Masters: ప్రీ క్వార్టర్స్‌కు లక్ష్యసేన్, శ్రీకాంత్
19 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 11, 2026, 11:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)