- దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్
బెంగళూరు: ఈస్ట్‌జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీలో నార్త్ ఈస్ట్ జోన్ ఫాలోఆన్‌లో పడింది. తొలి ఇన్నింగ్స్‌లో ఈస్ట్‌జోన్ 467పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేయగా.. సోమవారం నార్త్ ఈస్ట్ జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 111పరుగులకే కుప్పకూలింది. ఈస్ట్‌జోన్ బౌలర్ అభిజిత్ సర్కార్(5/20)కి తోడు షాబాజ్ అహ్మద్(3/20) బౌలింగ్‌లో రాణించారు. దీంతో ఫాలోఆన్‌లో పడిన నార్త్ ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్లేమీ నష్టపోకుండా 7 పరుగులు చేసింది. ఆ జట్టు ఇంకా 349పరుగులు వెనుకబడి ఉంది.
వెస్ట్ జోన్‌తోబిసిసిఐ సెంట్రల్ ఎక్సలెన్స్ అకాడమీలో జరుగుతున్న మరో మ్యాచ్‌లో రెండోరోజు ఆట నిలిచే సమయానికి నార్త్ జోన్ జట్టు పట్టు బిగిస్తోంది. ఆ జట్టు రెండోరోజు ఆట నిలిచే సమయానికి 4వికెట్ల నష్టానికి 107పరుగులు చేసింది. ఆయుష్ బడోనీ(39)కి తోడు కన్హయ్య వాధవన్(8) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో వెస్ట్ జోన్ జట్టు 187పరుగులకే పరిమితం చేయడంలో వెస్ట్‌జోన్ బౌలర్లు సఫలమయ్యారు. అభిజిత్ ముస్తాక్(5/39), ఆర్ష్‌దీప్(3/53), కంబోజ్(3/38) బౌలింగ్‌లో రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో నార్త్ జోన్ జట్టు 251పరుగులకే ఆలౌట్ కాగా.. ఆ జట్టుకు 64పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత లభించింది.








కామెంట్‌లు (0)