ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మలేరియా, పచ్చకామెర్లతో గిరిజన విద్యార్థిని మృతి

25 నిమిషాల క్రితం

మలేరియా, పచ్చకామెర్లతో గిరిజన విద్యార్థిని మృతి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026, 11:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం (పార్వతీపురం మన్యం జిల్లా) : మలేరియా జ్వరం, పచ్చకామెర్లతో బాధపడుతూ ఓ గిరిజన విద్యార్థిని ఆదివారం రాత్రి మృతి చెందింది. స్థానికుల కథనం ప్రకారం... పార్వతీపురం మన్యం జిల్లా నోండ్రకోన పంచాయతీ కేసర గ్రామానికి చెందిన పత్తిక నందిక (11) గుమ్మలక్ష్మీపురం కస్తూరిబా పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. రెండు రోజులుగా మలేరియా జ్వరం, పచ్చ కామెర్లు వ్యాధితో బాధపడుతోంది. తీవ్ర అస్వస్థతకు గురైన నందికకు పాఠశాలలో వైద్యం అందించారు. అయినప్పటికీ వ్యాధి ముదరడంతో భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి ఆదివారం ఉదయం తీసుకెళ్లారు. వైద్యులు సంతోష్ కుమార్ వైద్యమందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయింది. తమ కళ్ల ముందే వైద్యం పొందుతూ కుమార్తె చనిపోవడాన్ని చూసిన తల్లి గుండెలు పగిలేలా రోధిస్తోంది. విద్యార్థిని తండ్రి కొన్నేళ్ల క్రితం మృతిచెందారు. తల్లి మంజుల వ్యవసాయ కార్మికురాలిగా జీవనం సాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్