మంగళవారం, 04 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

SL Vs PAK - చివరి టి 20లో పాక్ విజయం.. సిరీస్ శ్రీలంకదే

11 గంటల క్రితం

SL vs PAK – Pakistan wins the final T20; Sri Lanka clinches the series.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 04, 2026, 02:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

దంబుల్లా : శ్రీలంక పర్యటనను పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టు విజయంతో ముగించింది. మంగళవారం జరిగిన మూడో టీ20లో నాలుగు వికెట్ల తేడాతో గెలిచి క్లీన్‌స్వీప్ గండం నుంచి బయటపడింది. అయితే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను శ్రీలంక 2-1తో కైవసం చేసుకుంది. అంతకుముందు జరిగిన వన్డే సిరీస్‌ను కూడా శ్రీలంక 2-1తోనే సొంతం చేసుకుంది. చివరి టీ20లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. కెప్టెన్ చమరి ఆటపట్టు 34 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, సంజనా కవింది 20, ఇమేషా దులాని 17 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో మొమినా రియాసత్ రెండు వికెట్లు తీయగా, ఉమ్-ఎ-హనీ, నష్రా సంధు, తూబా హసన్, ఆయేషా జాఫర్ తలో వికెట్ దక్కించుకున్నారు. 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 18.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. ఆయేషా జాఫర్ 39, షవాల్ జుల్ఫికర్ 21 పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చారు. శ్రీలంక బౌలర్లలో చమరి ఆటపట్టు, కవిశా దిల్హరి చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో పాకిస్తాన్ పరువు నిలబెట్టుకోగా, శ్రీలంక రెండు సిరీస్‌లను సొంతం చేసుకుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్