ప్రీ క్వార్టర్స్‌కు జ్వెరేవ్, డి మినార్
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ పురుషుల సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్లోకి జర్మనీకి చెందిన 2వ సీడ్, జ్వెరేవ్, 5వ సీడ్, ఆస్ట్రేలియాకు చెందిన డి మినార్ ప్రవేశించారు. శనివారం జరిగిన మూడోరౌండ్ పోటీలో జ్వెరేవ్ 6-2, 7-6(7-4), 6-3తో ఎం. గిరోన్(అమెరికా)ను చిత్తుచేయగా.. డి. మినార్ 6-2, 5-7, 6-2, 6-4తో స్వజ్జా(అమెరికా)ను ఓడించాడు. ఇక 9వ సీడ్, కోబలి(ఇటలీ) 6-0, 6-7(4-7), 6-7(5-7), 6-2, 6-2తో 19వ సీడ్, రష్యాకు చెందిన ఖచనోవ్‌ను ఓడించి ప్రీ క్వార్టర్స్‌కు చేరాడు.
స్వైటెక్, రైబకినా ఔట్...
ఇక మహిళల సింగిల్స్‌లో 2వ సీడ్, కజకిస్తాన్‌కు చెందిన రైబకినా, 3వ సీడ్ పోలండ్‌కు చెందిన ఇగా స్వైటెక్ అనూహ్యంగా మూడోరౌండ్‌లో ఇంటిదారి పట్టారు. శనివారం జరిగిన మూడోరౌండ్ పోటీలో రైబకినా 6-7(4-7), 1-6)తో 25వ సీడ్, జర్మనీకి చెందిన మెర్టెన్స్ చేతిలో ఓడింది. ఇక స్వైటెక్ 6-7(9-11), 2-6తో 29వ సీడ్, చెక్ రిపబ్లిక్‌కు చెందిన ఇలా చేతిలో ఓడింది. ఇతర పోటీల్లో కోస్ట్యక్(ఉక్రెయిన్ 6-2, 4-6, 6-1తో నవ్వారో (అమెరికా)పై గెలుపొందగా.. 21వ సీడ్, చెక్ రిపబ్లి క్‌కు చెందిన బౌజ్కోవా 4-6, 7-6(7-3), 6-4తో సోమ్సోనోవా(రష్యా)ను ఓడించారు.
ఫెడరర్ రికార్డుకు సమం
వింబుల్డన్‌లో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటిన సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ చరిత్రలో నిలిచే ఘనతను అందుకున్నాడు. టోర్నీలో 105వ మ్యాచ్‌ను గెలిచి పురుషుల సింగిల్స్‌లో అత్యధిక విజయాలు సాధించిన రోజర్ ఫెడరర్ రికార్డును సమం చేశాడు. అయితే వింబుల్డన్ చరిత్రలో మహిళలు, పురుషులు కలిపి అత్యధిక సింగిల్స్ విజయాల రికార్డు మాత్రం మార్టినా నవ్రతిలోవా పేరిటే కొనసాగుతోంది. ఇక టోర్నీ చరిత్రలో మహిళలు, పురుషులు కలిపి అత్యధిక సింగిల్స్ విజయాల రికార్డు మాత్రం దిగ్గజ టెన్నిస్ క్రీడాకారిణి మార్టినా నవ్రతిలోవా పేరిటే కొనసాగుతోంది. ఆమె వింబుల్డన్‌లో మొత్తం 120 సింగిల్స్ విజయాలు సాధించి ఇప్పటికీ అగ్రస్థానంలో నిలిచారు.







కామెంట్‌లు (0)