- రెండో వన్డేలో ఆస్ట్రేలియా-ఎ మహిళలపై ఇండియా-ఎ సంచలన విజయం
మొహాలీ: ఆస్ట్రేలియా-ఎ మహిళలు నిర్దేశించిన భారీ ఛేదనను ఇండియా-ఎ మహిళలు మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించారు. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా-ఎ మహిళలు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 362 పరుగులు చేయగా.. ఛార్లీ(109) సెంచరీకి తోడు వెబ్(95) బ్యాటింగ్‌లో రాణించారు. ఇండియా బౌలర్లు వైష్ణవి శర్మ, నిక్కి ప్రసాద్‌కు నాలుగేసి వికెట్లు దక్కాయి. భారీ ఛేదనలో ఇండియా-ఎ మహిళల టాపార్డర్ విఫలమైనా తానీషా(60), కెప్టెన్ అనుష్క శర్మ(58), నిక్కి ప్రసాద్(76)కి తోడు చివర్లో మిన్ను మణి(88) బ్యాటింగ్‌లో రాణించి మ్యాచ్‌ను ముగించారు. ఆస్ట్రేలియా-ఎ బౌలర్లు లిన్ మిల్స్, నాట్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో ఇరుజట్లు ఒక్కో మ్యాచ్‌లో గెలిచి 1-1తో సమంగా నిలువగా.. మూడో, చివరి వన్డే మంగళవారం(29న) జరగనుంది.







కామెంట్‌లు (0)