ఆదివారం, 13 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

US Open: టైటిల్‌ విజేత రిబాకినా

23 నిమిషాల క్రితం

us open.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 13, 2026, 08:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • సబలెంకాపై 6-4, 5-7, 6-2తో విజయం..

  • తొలిసారి యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ కైవసం

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను కజకిస్థాన్‌ స్టార్‌, ప్రపంచ నంబర్‌ 2 ఎలెనా రిబకినా గెలుచుకుంది. శనివారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌, బెలారస్‌ స్టార్‌ అరీనా సబలెంకాను 6-4, 5-7, 6-2 తేడాతో ఓడించింది. దీంతో రిబకినా తొలిసారి యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది.

మ్యాచ్‌ తొలి సెట్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్‌ చేసిన రిబకినా 6-4తో సెట్‌ను కైవసం చేసుకుని శుభారంభం చేసింది. రెండో సెట్‌లో సబలెంకా పుంజుకుంది. రెండు సెట్‌ పాయింట్లను కాపాడుకున్న ఆమె అనంతరం రిబకినా సర్వీస్‌ను బ్రేక్‌ చేసి 7-5తో సెట్‌ను గెలుచుకుంది.

నిర్ణయాత్మక మూడో సెట్‌లో రిబకినా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. సబలెంకా సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేసి 6-2తో సెట్‌ను గెలుచుకోవడంతో పాటు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను ఖాయం చేసుకుంది. ఇది రిబకినాకు మూడో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌. ఈ విజయంతో ఆమె డబ్ల్యూటీఏ సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. తద్వారా ప్రపంచ నంబర్‌ వన్‌ ర్యాంక్‌ సాధించిన తొలి కజకిస్థాన్‌ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్