ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రవర్తనే పరిచయ పత్రం

13 సెప్టెంబర్, 2026

alaparthy vari geyam-13.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 13, 2026, 07:53 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

వ్యావహార శైలిలోన

వ్యక్తిత్వం కనిపించును!

నాగరికత గుర్తింపుకు

నడతే అద్దం పట్టును!!

​

ప్రవర్తనే మన పరిచయ

పత్రం అవుతుంది సదా!

అలవట్లే మన స్వభావ

కొలమానం అగును గదా!!

​

మనం ఏవి ఇస్తే అవె

మనకు తిరిగివస్తాయీ!

గౌరవ మర్యాదలకూ

క్రమముగ వర్తిస్తాయీ!!

​

రాళ్లు రువ్వితే మనమూ

రాలవు మనపైన పూలు!

పూలు రువ్వి తేనె మనము

పొందుతాము కొంత మేలు!!

​

ఎవ్వరినీ ముంచకుండ

ఎడతెగనీ శోకంలో,

విజ్ఞతతో మెలగువారె

వివేకులీ లోకంలో!!

​

‘’బాలబంధు`` అలపర్తి వెంకట సుబ్బారావు

(కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత)

94408 05001

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్