ఆదివారం, 13 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మా స్కూల్లో తెలుగు భాషా దినోత్సవం

30 నిమిషాల క్రితం

IMG_20260829_134640.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 13, 2026, 07:54 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

మా స్కూల్లో గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన ఏకపాత్రాభినయం, పద్యాల పోటీలు నిర్వహించడం జరిగింది. వ్యాసరచన పోటీలలో విద్యార్థులు ముని రమణమ్మ, ఆవాల వంశీ, మల్లపురెడ్డి ఉమామహేశ్వరి ఏకపాత్రాభినయం పోటీలో పాల్గొని, బహుమతులు పొందారు. కాళ్లరంజని,_ బెవర సిరి, పిల్లా మోహిత్ పద్యాల పోటీలో పాల్గొని, బహుమతులు పొందారు. దిండి రక్షిత శ్రీ,_ కాళ్ళ కీర్తన, అక్షర ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించి బహుమతులు అందుకున్నారు. విద్యార్థినీ విద్యార్థులు తెలుగువారి సంప్రదాయ దుస్తులలో పాఠశాలకు వచ్చి నిండుదనాన్ని తీసుకువచ్చారు. సుమారు 60 రకాలైన తెలుగువారి వంటకాలను ప్రదర్శనగా ఏర్పాటు చేసి గ్రామస్తులు విద్యార్థులు అందరూ వాటిని పరిశీలిస్తూ వాటి రుచులను తెలుసుకున్నారు._ తెలుగువారి అసలైన వంటకాలు చక్కెర పొంగలి, దద్దోజనం, పులగం, చలివిడి,_ సోడిపిండట్టు,_ చేగోడీలు,__జంతికలు, ఉలవండలు, పప్పు ఉండలు, నువ్వు ఉండలు, సున్నుండలు, అరిసెలు, గారెలు, బూరెలు,_ ఐదు రకాల పులిహోరలు, మినప వడియాలు, సగ్గుబియ్యం వడియాలు,_ నెయ్యి వడియాలు, వరిపిండి వడియాలు, తెలగపిండి వడియాలు... ఇలా 60 రకాల ఆహార పదార్థాలను విద్యార్థులు ఆనందంగా తిలకించి, తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా తెలుగు భాష గొప్పదనం,_ తెలుగువారి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల గొప్పదనం గురించి తెలుగు ఉపాధ్యాయులు నంబూరు శ్రీనివాసరాజు పద్య, గద్య, గేయ రూపంలో వర్ణించడం పిల్లలకు నచ్చింది._ పాఠశాల కమిటీ అధ్యక్షులు పిల్లా చిరంజీవి, ప్రధానోపాధ్యాయుని శ్రీమతి ఇందిరా దేవి, ఉపాధ్యాయులు కార్యక్రమం పట్ల తమ సంతోషాన్ని తెలియజేసారు._


ఉపాధ్యాయ బృందం,

పిఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,

రఘుమండ, డెంకాడ మండలం, విజయనగరం.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్