శుక్రవారం, 30 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

World Wrestling Championship: మనీషా బన్వాలాకు స్వర్ణం

1 గంట క్రితం

Manisha Banwala.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026, 09:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో తొలి భారతీయ మహిళగా రికార్డు

అస్తానా: ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ మనీషా బన్వాలా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. మహిళల 59 కిలోల విభాగంలో జరిగిన ఫైనల్ పోరులో అమెరికా రెజ్లర్ అబిగల్ ఎలిజబెత్‌పై 8-6 పాయింట్ల తేడాతో విజయం సాధించి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది.

ఈ విజయంతో మనీషా భారత రెజ్లింగ్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇప్పటివరకు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరిన భారత మహిళా రెజ్లర్ల సంఖ్య నలుగురికి మాత్రమే పరిమితమైంది. 2021లో అన్షు మాలిక్ తొలిసారిగా ఫైనల్‌కు చేరి రజత పతకాన్ని సాధించింది. ప్రస్తుత సీజన్‌లో నీలమ్ (50 కిలోలు), కాజల్ (76 కిలోలు) కూడా ఫైనల్ వరకు చేరినప్పటికీ రజత పతకాలతో సరిపెట్టుకున్నారు.

అయితే, ఈసారి మనీషా బన్వాలా ఫైనల్‌లో ప్రత్యర్థిని ఓడించి స్వర్ణ పతకాన్ని అందుకోవడం విశేషం. అంతేకాకుండా, భారత రెజ్లింగ్ చరిత్రలో పురుషులు, మహిళలు కలిపి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన రెండో భారతీయ రెజ్లర్‌గా కూడా ఆమె నిలిచింది. గతంలో 2010లో పురుషుల విభాగంలో సుశీల్ కుమార్ స్వర్ణ పతకం సాధించాడు. దాదాపు 16 ఏళ్ల తర్వాత ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో స్వర్ణం అందించిన మనీషా బన్వాలాపై క్రీడాభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్