శుక్రవారం, 30 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionయుపిలో మళ్లీ అధికారంలోకి వస్తాం..యుసిసి అమల్జేస్తాం

1 గంట క్రితం

యుపిలో మళ్లీ అధికారంలోకి వస్తాం..యుసిసి అమల్జేస్తాం  
  - కేంద్ర హోంమంత్రి అమిత్​ షా image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026, 09:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • కేంద్ర హోంమంత్రి అమిత్​ షా

లక్నో : ఉత్తరప్రదేశ్​లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్​ షా శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. యుపిలో మళ్లీ బిజెపినే అధికారంలోకి వస్తుందని, అప్పుడు రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి (యుసిసి)ని అమల్జేస్తామని ప్రకటించారు. ఇప్పటికే దీనిని అనేక రాష్ట్రాల్లో అమలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం యుపిలో బిజెపి ప్రభుత్వం సుస్థిరంగా ఉందని, దానిని ఎవరూ కదిలించలేరని వ్యాఖ్యానించారు. ‘యుపిలో బిజెపి ప్రభుత్వం అంగదుడి పాదం (కదిలించలేనిది) లాంటిది. దీనిని ఎవరూ కదిలించలేరు. బిజెపి మళ్లీ యుపిలో ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు" అని ఆయన పేర్కొన్నారు. సమాజ్​వాదీ పార్టీ ఇకపై యుపిలో అధికారంలోకి రాదని పేర్కొన్నారు. ‘అఖిలేశ్​ బాబూ, గుర్తుంచుకోండి. వచ్చే 30 ఏళ్ల వరకు మీ పార్టీ ఉత్తరప్రదేశ్​లో ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. ప్రజలు మీ మూడో తరానికి కూడా క్షమించరు" అని ఆయన సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ను ఉద్దేశించి అన్నారు. అయితే ఇటీవల జరిగిన శాసనమండలి ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఉపాధ్యాయ, పట్టుభద్రుల నియోజవర్గాలు రెండింటిలోనూ బిజెపి పరాభవం పాలైంది. ఈ నేపథ్యంలో అఖిలేశ్‌ మాట్లాడుతూ యుపిలో బిజెపికి రోజులు దగ్గరపడుతున్నాయని పేర్కొన్న సంగతి తెలిసిందే.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్