శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకశ్మీర్‌లో ఉగ్రవాద ఫైనాన్స్‌ నెట్‌వర్క్‌ గుట్టు రట్టు..

30 అక్టోబర్, 2026

Terror
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026, 09:22 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • 10 మంది అరెస్టు

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్​ పోలీసులు శుక్రవారం ఓ భారీ ఉగ్రవాద ఆర్థిక నెట్​వర్క్​ను ఛేదించారు. ఉగ్ర కార్యకలాపాల కోసం నిధులు సేకరిస్తూ, వాటిని టెర్రరిస్టులకు చేరవేస్తున్నారన్న అభియోగాలతో 10 మంది నిందితులను అరెస్టు చేశారు. షోపియాన్​ పోలీస్​ స్టేషన్​లో దీనిపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు.

"వివిధ ఆన్​లైన్ పేమెంట్ యాప్​ల్లో జరిగిన అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలను గుర్తించాం. దీనితో ఆ ఉగ్రవాదుల ఫైనాన్సింగ్​ నెట్​వర్క్​ గుట్టురట్టు అయ్యింది. ఉగ్రకార్యకాలాపాల కోసం సేకరించిన డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందోనే కోణంలో మేము దర్యాప్తు చేశాం. ఈ దర్యాప్తులో వేర్వేరు జైళ్లలో ఉన్న ఉగ్రవాదులతో, వారి అనుచరులతో ఈ నిందితులకు సంబంధాలు ఉన్నట్లు తేలింది. అరెస్టు అయిన వారిలో షోపియాన్​కు చెందిన ఒవైస్​ షఫీ నైకూ (సైద్​పోరా బాలా), తజాముల్​ అహ్మద్ షా (రావల్​పోరా), మోయిజ్ ఇక్బాల్, ఇమ్దాద్​ యూసుఫ్ గని (చిత్రగామ్ కలాన్​), పుల్వామాకు చెందిన సాకిబ్​ జహూల్​ వాని, అమీరర్​ అహ్మద్ గని, లియాఖత్​ నజీర్ లోన్,​ ట్రెంచ్​ నాడిగుండ్​కు చెందిన ఫిరదౌస్​ తోకర్​, కథువా చెక్​ హరియాకు చెందిన మహ్మద్ హనీఫ్​, కాజు ఉన్నారు. వీరు సామాన్య ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి, నిషేధిత ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా (ఎల్‌ఇటి), దాని అనుబంధ సంస్థ "ది రెసిస్టెన్స్​ ఫ్రంట్​" (టిఆర్​ఎఫ్​) కార్యకలాపాల కోసం అందిస్తున్నారు. ఇందుకోసం వారు రహస్యంగా ఆన్​లైన్​ పేమెంట్ యాప్​లను వాడుతున్నట్లు మా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ నిధులను ఉగ్రవాదులకు అవసరమైన వసతులు కల్పించడానికి, ముఖ్యంగా నెట్​వర్క్​లో ఉన్నవారికి స్మార్ట్​ఫోన్​లు కోనుగోలు చేయడానికి ఉపయోగించినట్లు తేలింది. ఈ నెట్​వర్క్​తో సంబంధం ఉన్న ఇతరులను గుర్తించడానికి, మిగిలిన టెర్రర్ ఫైనాన్సింగ్​ లింక్​లను కనిపెట్టడానికి, ఈ నెట్వర్క్​ ఎంత విస్తృతంగా వ్యాపించి ఉందో గుర్తించడానికి దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. విచారణ ముందుకు సాగే కొద్దీ మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది" అని పోలీసులు తెలిపారు. ఇంతకు ముందు, ఈ ఆగస్టులో శ్రీనగర్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్రాష్ట్ర లష్కరే తోయిబా ఉగ్ర ముఠాను జమ్మూ కశ్మీర్ పోలీసులు ఛేదించారు. ఈ ఆపరేషన్‌లో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ పాకిస్థానీ ఉగ్రవాదులతో పాటు శ్రీనగర్‌కు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో 16 ఏళ్లుగా పరారీలో ఉన్న పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాది అబ్దుల్లా అలియాస్ అబు హురైరా కూడా ఉన్నాడని అధికారులు తెలిపారు. అతడు జమ్ముకశ్మీర్ వెలుపలకు లష్కరే తోయిబాను విస్తరించడానికి ప్రయత్నించాడని తెలిపారు. పాక్‌కు చెందిన మరో ఉగ్రవాది ఉస్మాన్ అలియాస్ కుబైబ్‌ను ఆగస్టు నెల 6న అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్