తెలుగు, తెలంగాణా సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తున్న బోనాల సంబరాలు మా పాఠశాలలో చాలా బాగా జరుపుకున్నాం. పోతురాజు, అమ్మవారి వేషధారణలతో బోనాలను మేమంతా తలపై పెట్టుకుని అమ్మవారికి బోనాలు సమర్పించాము. మేమంతా మా ఇళ్ల నుంచి బోనాల కుండలతో పాఠశాల ప్రాంగణానికి చేరుకున్నాం. అనంతరం బోనాలకు, గౌరీ మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించాం. మాతోపాటుగా మా ఉపాధ్యాయినులు కూడా అమ్మవారికి బోనాలు సమర్పించారు. గ్రామోత్సవం ముందు పోతురాజు వేషధారణలతో మాలోని కొందరు ఆకట్టుకున్నారు. ‘తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలకు బోనాల సంబరాలు ప్రతీకగా నిలుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బోనాల సంబరాలకు ప్రత్యేక స్థానం ఏర్పడింది’ అని మా స్కూలు కరస్పాండెంట్ వల్లభనేని మురళీకృష్ణ గారూ, ప్రిన్సిపాల్ వల్లభనేని నాగలక్ష్మి గారు సందేశం ఇచ్చారు. ఈ వేడుకలతో మాలోనూ మన సంస్కృతి, సాంప్రదాయాల పట్ల గౌరవం, ఆనందోత్సవాలు వెల్లి విరిశాయి.

జాహ్నవి, 2వ తరగతి, బచపన్ ప్లే స్కూలు,
తాడేపల్లి, గుంటూరుజిల్లా.








కామెంట్‌లు (0)