ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అన్ని కళల్లోనూ రాణించాలనేదే నా ఆశయం !

58 నిమిషాల క్రితం

karate
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026, 12:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హాయ్‌ ఫ్రెండ్స్‌!

​నాకు చిన్నప్పటి నుంచే నాట్యం, కరాటే, యోగా, కర్ర సాము వంటి కళలంటే ఎంతో ఇష్టం. కూచిపూడి, భరతనాట్యం, వెస్ట్రన్‌ డ్యాన్స్‌తో పాటు వివిధ రకాల నృత్యాల్లో శిక్షణ పొందుతున్నాను. నాట్యంలో నేషనల్ స్థాయి గుర్తింపు పొందాను. మార్షల్‌ ఆర్ట్స్‌లోనూ ఆసక్తిగా సాధన చేస్తున్నాను. కరాటే, యోగాపోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో బహుమతులు పొందాను. క్రీడాకారిణిగా గుర్తింపు పొందడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇప్పటివరకు వివిధ పోటీల్లో పాల్గొని రాష్ట్ర, జాతీయస్థాయిలో పలు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందుకున్నాను. డ్యాన్సు విభాగంలో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో నాపేరునమోదు కావడం గర్వ కారణంగా భావిస్తున్నాను.

​సమీక్ష ఆర్ట్స్‌ అకాడమీ ద్వారా అన్ని కళల్లోనూ శిక్షణ పొందుతున్నాను. మా అమ్మ మెర్సీ నాకు గురువుగా ఉండటం నా అదృష్టం. ఆమె ఎంతో నైపుణ్యంతో, ఓర్పుతో శిక్షణ ఇస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నారు. అమ్మ ఇచ్చే ప్రోత్సాహంతో, ఇంకా ఇతర గురువులు కూడా నాట్యం, యోగా, కరాటే, కర్ర సాములో మరింత ప్రతిభ కనబరచడానికి కృషి చేస్తున్నాను.

​చదువుతోపాటు నాకు ఇష్టమైన కళల్లోనూ రాణించాలన్నదే నా కోరిక.

నేను నేర్చుకునే ప్రతి కళలో ప్రతి ఒక్కరికి నేను నేర్పించే అంత విధంగా ఎదగాలన్నది నా యొక్క గట్టి సంకల్పం. భవిష్యత్తులో మరిన్ని రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని విజయాలు సాధించాలని, గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో స్థానం సంపాదించాలని ఆశిస్తున్నాను.

​ఇ. సమీక్ష . మిక్కీ ,7వ తరగతి, బీఎల్‌ ఆల్ఫా కాన్వెంట్‌ హైస్కూల్‌, మంచిర్యాల జిల్లా, తెలంగాణ.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్