వరంగల్ : ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో .... జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూగర్భగనుల శాఖ ఎడి జయరాజు నివాసాల్లో ఎసిబి అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ ఎసిబి జాయింట్ డైరెక్టర్ సాయి మనోహర్, వరంగల్ ఎసిబి డిఎస్పి సాంబయ్య ఆధ్వర్యంలో సూర్యాపేట, తాండూరు, సహా 12 చోట్ల తనిఖీలు చేపట్టారు. బోడుప్పల్ ఈస్ట్ హనుమాన్ నగర్‌లోని జయరాజు నివాసంలో.. ఆస్తులకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు లావాదేవీలు తదితర వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. సోదాల్లో ఇప్పటివరకు రెండు అంతస్తుల భవనం, రెండు కార్లు, రూ.1.50 లక్షల నగదు, రెండు బైక్ లు, జనగాం జిల్లాలో 5 ఎకరాల వ్యవసాయ భూమి, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పోస్టల్ డిపాజిట్లు గుర్తించినట్లు సమాచారం. అయితే సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. సోదాల అనంతరం ఆస్తుల విలువ, స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఇతర వివరాలపై ఎసిబి అధికారులు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.
మైనింగ్ ఎడి నివాసాల్లో ఎసిబి తనిఖీలు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 27, 2026, 11:47 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)