గురువారం, 27 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కుల వివక్ష అంటరానితనం పూర్తిగా నిర్మూలించాలి : కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి

1 గంట క్రితం

Caste discrimination and untouchability must be completely eradicated: KVPS State General Secretary Andra Malyadri.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 27, 2026, 12:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-విశాఖ కలెక్టరేట్ : కుల వివక్ష, అంటరానితనం పూర్తిగా నిర్మూలించి అందరికీ సమాన హక్కులు కల్పించాలని కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి డిమాండ్ చేశారు. దళితులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై, "సామాజిక శంఖారావం" పేరుతో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కెవిపిఎస్) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాల్యాద్రి మాట్లాడుతూ ... దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 పూర్తయినప్పటికీ, ఈనాటికి దేశంలో, రాష్ట్రంలోనూ, దళితులు వివక్షతకు గురవుతున్నారని చెప్పారు. దళిత కాలనీలో మంచినీరు విద్యుత్ డ్రైనేజీ రోడ్లు మెట్లు రిటైనింగ్ వాల్స్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించబడలేదు అన్నారు. తక్షణం వీటిని కల్పించాలన్నారు. దళితులకు హామీ ఇచ్చిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. దళితుల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం ఆపి న్యాయమైన పరిహారం చెల్లించాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు, కులాంతర వివాహ ప్రోత్సాహకాలు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దళితుల అభివృద్ధికి ఖర్చు చేయాలన్నారు. ఇల్లు లేని వారికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని, ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.లోకనాథం, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గు నాయుడు,మాజీ కార్పొరేటర్ బి.గంగారావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.కే.ఎస్.వి. కుమార్, కార్యవర్గ సభ్యులు పి.మణి,బి.జగన్, ఎల్.జె.నాయుడు, ఎం.సుబ్బారావు, టి.నూకరాజు, ఉరుకుటి రాజు, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు యుఎస్ఎన్ రాజు, కార్యదర్శి కె.మహేష్ , ఐద్వా రాష్ట్ర నాయకురాలు బి.పద్మ, జిల్లా కార్యదర్శి వై. సత్యవతి,అధ్యక్షురాలు ఆర్.ఎన్.మాధవి,కెవిపిఎస్ నాయకులు వై. రాజు,తిరుకోటి చిరంజీవి,వై.టి.దాసు తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్