ప్రజాశక్తి-విశాఖ కలెక్టరేట్ : మండుతున్న నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ .... గురువారం సిపిఐ ఆధ్వర్యంలో విశాఖ జగదాంబ జంక్షన్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి షేక్ రహిమాన్ మాట్లాడుతూ .... విపరీతంగా పెరిగిన ధరలు సామాన్యులపై పిడుగులు పడినట్లుగా మారాయన్నారు. ధరలను అదుపు చేసే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. 5 నెలలు క్రిందట రూ.1370 ఉన్న 26 కిలోల బియ్యం ధర ఈ రోజు రూ.1770 ఉందని, రూ.400 పెరిగిందని వీటితో పాటు పంచదార, అపరాలు, పప్పులు, నూనెల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. ధరల పెరుగుదల వలన పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. 12 సంవత్సరాల క్రితం తను అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తానని, సంవత్సరానికి 2 కోట్లు ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగం నిర్మూలిస్తామని, విదేశాల్లో ఉన్న నల్లధనం తీసుకొచ్చి పేదలకు పంచుతానని హామీలు ఇచ్చిన నరేంద్ర మోడి.. ఆ హామీలన్నిటినీ గాలికి వదిలేసారని ఆరోపించారు. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మరుపిళ్ల పైడిరాజు, జిల్లా సహాయ కార్యదర్శి పి.చంద్రశేఖర్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.మన్మధరావు, ఎండి బేగం తదితరులు పాల్గొన్నారు.
నిత్యావసరాల ధరలు తగ్గించాలి : సిపిఐ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 27, 2026, 12:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)