మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆదిలాబాద్ రిమ్స్‌ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం - ఇద్దరు చిన్నారులు మృతి

1 గంట క్రితం

Fire at Adilabad RIMS Hospital – Two children die.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 11:54 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఆదిలాబాద్ రిమ్స్‌ పిల్లల వార్డులో అగ్ని ప్రమాదం

ఇద్దరు చిన్నారులు మృతి, పలువురికి గాయాలు


ప్రజాశక్తి-హైదరాబాద్ బ్యూరో : ఆదిలాబాద్ రిమ్స్‌ ఆస్పత్రిలో సోమవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్‌సర్క్యూట్‌తో పిల్లల వార్డులో ఏసీ కంప్రెషర్ పేలడంతో అదే వార్డులో చికిత్స పొందుతున్న ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. పలువురు చిన్నారులకు గాయాలయ్యాయి. గాయపడిన వారితో సహా మొత్తం 27 మంది చిన్నారులను వైద్యులు సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ ఘటనా స్థలిని పరిశీలించి విచారణకు ఆదేశించారు. ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రి ఎస్‌ఎన్‌సీయూ వార్డులో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఘటనకు దారితీసిన కారణాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని ఆసుపత్రుల్లో భద్రతా చర్యలను పటిష్టం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్