హైదరాబాద్ : హుస్సేన్‌సాగర్‌లో దూకి విదేశీ యువకుడు ఆత్మహత్యాయత్నానికి యత్నించిన ఘటన సచివాలయం సమీపంలో జరిగింది. ఆ సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న సైఫాబాద్ పోలీసులు గమనించి వెంటనే తాడు సాయంతో అతడిని రక్షించారు. ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి టోలిచౌకి పారామౌంట్ కాలనీలో నివాసముంటున్న సుడాన్ దేశానికి చెందిన నాజర్ ఆడమ్ బడా వేగా (25) గుర్తించారు. విచారణ నిమిత్తం లేక్ పోలీసులకు అతడిని అప్పగించారు. విదేశీ యువకుడు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై లేక్ పోలీసులు విచారణ చేపట్టారు.
హుస్సేన్‌సాగర్‌లో దూకి విదేశీ యువకుడు ఆత్మహత్యాయత్నం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 26, 2026, 11:12 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)