రెబల్ టిఎంసి ఎంపిలకు లోక్‌సభ సెక్రటేరియట్ నోటీసులు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది రెబల్ ఎంపిలకు లోక్‌సభ సెక్రటేరియట్ నోటీసులిచ్చింది. ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. ఆగస్టు 25న ఆ నోటీసులు జారీ చేసింది. లోక్‌సభ అనర్హత వేటు రూల్ 6 కింద ఆ నోటీసులిచ్చింది. టిఎంసి నేత అభిషేక్ బెనర్జీ ఆ ఎంపిలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ జూన్ 18న పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. టిఎంసికి చెందిన 20 మంది ఎంపిలు త్రిపురకు చెందిన నేషనలిస్టు సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరినట్లు ప్రకటించారు. పార్లమెంట్‌లో ఆ గ్రూపును ఎన్‌సిపిఐగా పేర్కొన్నారు. ఎన్‌డిఎ పార్లమెంటరీ కార్యకలాపాల్లోనూ వారు పాల్గొన్నారు.
అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌పై వాదనలు చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొన్నది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ వి మోహనతో కూడిన ధర్మాసనం కూడా 20 మంది ఎంపిలకు నోటీసులిచ్చింది. నోటీసులివ్వడం సమస్య కాదని, నిర్ణీత సమయంలో కేసును పరిష్కరించాలని ధర్మాసనం పేర్కొంది. అభిషేక్ బెనర్జీ పిటిషన్‌లో ఉన్న ఎంపిల్లో కకోలి ఘోష్ బస్తీదార్, సుదీప్ బందోపాధ్యాయ, శతాబ్ధి రాయ్, ప్రసూన్ బెనర్జీ, రచనా బెనర్జీ, జగదీశ్ చంద్ర బర్మ బసునియా, పార్తా భౌమిక్, అరూప్ చక్రవర్తి, అధికారి దీపక్ దేవ్, సయ్యాని ఘోష్, బాపి హల్దార్, ఎమ్‌డి అబూ తాహిర్ ఖాన్, కలిపాదా సారెన్ ఖేర్వాల్, అసిత్ కుమార్ మాల్, జూనె మాలియా, మిట్టాలి బాగ్, ఖలీలు్ రెహ్మాన్, మాలా రాయ్, శర్మిలా సర్కార్, యూసుఫ్ పఠాన్ ఉన్నారు.







కామెంట్‌లు (0)