బుధవారం, 26 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

యుపిలో భారీ వర్షాలు - వరదలో కొట్టుకుపోయిన ఏనుగులు

1 గంట క్రితం

Heavy rains in UP – Elephants swept away by floods
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 26, 2026, 11:08 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఉత్తరప్రదేశ్ : యుపిలో కురుస్తోన్న భారీ వర్షాలకు నదులు పోటెత్తుతున్నాయి. మంగళవారం ఉదయం ఉత్తరప్రదేశ్ లోని బహ్రాయిచ్‌లోని కౌడియాల నది ఉరకలేస్తుండటంతో ఐదు ఏనుగులు ఆ వరదలో కొట్టుకుపోయాయి. ఏనుగుల గుంపు గిర్జాపురి బ్యారేజ్ వైపు కొట్టుకుపోతున్నట్లు గుర్తించిన స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న కతర్నియాఘాట్ వన్యప్రాణి విభాగం అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. నీటిపారుదల శాఖ అధికారులు బ్యారేజ్ గేట్లను మూసివేసి .. ప్రవాహ తీవ్రత తగ్గిన అనంతరం ఆ ఐదు ఏనుగులను రక్షించారు. అనంతరం వాటిని సురక్షిత ప్రాంతానికి మళ్లించారు. వాటిలో రెండు ఏనుగు పిల్లలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. యుపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 75 జిల్లాల్లో వర్ష సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఏడు జిల్లాల్లో అతి భారీ వర్షాలు .. 33 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. నిన్న ఉదయం నుంచి లఖ్‌నవూ, వారణాసి, అయోధ్య, ఝాన్సీ సహా పలు నగరాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. 19 జిల్లాలకు వాతావరణ శాఖ వరద హెచ్చరికలు, ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్