బుధవారం, 26 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

వాట్సాప్‌లో కీలక సెక్యూరిటీ అప్‌డేట్

1 గంట క్రితం

whatsapp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 26, 2026, 12:00 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- 6 అంకెల పిన్ స్థానంలో పాస్‌వర్డ్

న్యూఢిల్లీ : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల ఖాతాల భద్రతను మరింత పెంచేందుకు కీలక మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటివరకు టూ-స్టెప్ వెరిఫికేషన్ కోసం ఉపయోగిస్తున్న 6 అంకెల పిన్ కు బదులుగా పూర్తి పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకునే అవకాశం కల్పించింది.

6 అంకెల పిన్ కు బదులు బలమైన పాస్‌వర్డ్

వాట్సాప్‌లో టూ-స్టెప్ వెరిఫికేషన్‌ను 2017 నుంచి 6 అంకెల పిన్ ఆధారంగా అందిస్తున్నారు. తాజాగా దీన్ని మరింత భద్రత కలిగిన పాస్‌వర్డ్ విధానంగా మార్చింది. యూజర్లు అక్షరాలు, సంఖ్యలు, ప్రత్యేక అక్షరాలతో కూడిన పాస్‌వర్డ్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ మార్పు ఖాతాలను హ్యాకింగ్, ఫిషింగ్, అనధికారిక యాక్సెస్ నుంచి రక్షించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

ఒక ఖాతాకు బహుళ పాస్ కీ

వాట్సాప్ ఇప్పటికే పాస్ కీ సపోర్ట్‌ను అందిస్తోంది. తాజాగా ఒకే ఖాతాకు ఒకటి కంటే ఎక్కువ పాస్ కీస్ జోడించుకునే అవకాశం కల్పించింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వంటి వేర్వేరు పరికరాలను ఉపయోగించే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. పాస్ కీస్ కోసం ఫింగర్‌ప్రింట్, ఫెస్ ఐడి లేదా ఫోన్ స్క్రీన్ లాక్ వంటి పరికర భద్రతా విధానాలను ఉపయోగించవచ్చు.

100 కోట్ల మందికి పాస్ కీ రక్షణ

వాట్సాప్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా యూజర్లు ఇప్పటికే పాస్ కీను ఏర్పాటు చేసుకున్నారు. కొత్త అప్‌డేట్‌తో మరిన్ని పరికరాల్లో పాస్ కీస్ ను ఉపయోగించుకునే వెసులుబాటు లభిస్తోంది.

తెలియని నంబర్ల కాల్స్‌పై మరింత సమాచారం

ఇదే అప్‌డేట్‌లో భాగంగా ఆండ్రాయిడ్ యూజర్లకు తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌పై అదనపు సమాచారాన్ని చూపించే ఫీచర్‌ను కూడా వాట్సాప్ తీసుకొచ్చింది. కాల్ చేస్తున్న వ్యక్తి ఏ దేశానికి చెందినవారు, వారితో ఏదైనా కామన్ గ్రూప్ ఉందా వంటి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీంతో అనుమానాస్పద, స్కామ్ కాల్స్‌ను గుర్తించడం సులభం కానుంది. వాట్సాప్ తీసుకొచ్చిన ఈ మార్పులు ఖాతా భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు, ఫిషింగ్, స్కామ్‌లు మరియు ఖాతా టేకోవర్‌లను అడ్డుకోవడంలో ఉపయోగపడనున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్