తెలంగాణ : జూరాల ప్రాజెక్టు వద్ద సోమవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ .... మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో రైతులు ధర్నాకు తరలిరావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో చిట్టెం రామ్మోహన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. చిట్టెం రామ్మోహన్ రెడ్డి జూరాల ప్రాజెక్టు వద్దకు చేరుకొని రైతులతో కలిసి ధర్నాలో పాల్గొనేందుకు వచ్చారు. ఆయన్ను పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు. అలాగే ధర్నా చేసేందుకు వచ్చిన రైతులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ క్రమంలోనే తోపులాట జరిగింది. రైతులను బలవంతంగా అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఓ ఎస్సై ఒక రైతు గల్లా పట్టుకుని అడ్డుకున్నారు. అలాగే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీనిపై బిఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ రైతులు, బిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. జూరాల ప్రాజెక్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో .... భారీగా పోలీసులు మోహరించారు. పోలీసులతో పాటు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు కూడా అక్కడే ఉన్నారు.
జూరాల ప్రాజెక్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత - చిట్టెం రామ్మోహన్ రెడ్డి అరెస్ట్
49 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 12:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)