సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రసాదంలో మత్తుమందిచ్చి మహిళలపై అత్యాచారం.. పూజారి అరెస్ట్

43 నిమిషాల క్రితం

Priest arrested for raping women after spiking *prasadam* with sedatives.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 12:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తమిళనాడు : ఆలయానికి వచ్చే మహిళలకు ప్రసాదంలో మత్తుమందు కలిపి ఇచ్చే ఓ పూజారి... ఆ మహిళలు స్పృహ కోల్పోయిన తర్వాత అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. కొన్నేళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా జరుపుతూ వచ్చిన పూజారి బండారాన్ని ఓ విద్యార్థిని బహిర్గంత చేసింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆ కామాంధ పూజారిని అరెస్టు చేశారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా వాళపాడి అనే గ్రామంలో వెలుగు చూసింది.


వివరాల్లోకెళితే .... వాళపాడి ప్రాంతంలో శనీశ్వరుని పేరుతో విజయరాజ (50) అనే వ్యక్తి ఆశ్రమాన్ని చిన్నపాటి ఆలయాన్ని నడుపుతున్నాడు. స్థానికులను పూజలు, చేతబడుల పేరుతో నమ్మించాడు. దీంతో తన వద్దకు వచ్చిన మహిళలు బాలికలపై లైంగిక దాడులకు పాల్పడుతూ వచ్చాడు. ఈ క్రమంలో వినాయకచవితి పండుగ సందర్భంగా ... ఓ విద్యార్థిని చందా కోసం ఆ పూజారి వద్దకు వెళ్లగా పూజారి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో భయపడిపోయిన ఆ బాలిక... పూజారి చేసినదంతా తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు పూజారిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత పోలీసుల తనిఖీల్లో అతడి ల్యాప్‌టా‌ప్‌లో 50 కి పైగా అశ్లీల వీడియోలు ఉన్నట్టు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. పూజల కోసం వచ్చే మహిళలకు ప్రసాదంలో మత్తుమందు కలిపి ఇచ్చి, వారు స్పృహ కోల్పోయిన తర్వాత అత్యాచారికి పాల్పడుతూ సీక్రెట్ కెమెరాతో ఆ దృశ్యాలను చిత్రీరించేవాడని నిర్థారణ అయ్యింది. ఈ వీడియోలను డబ్బు కోసం డార్క్ వెబ్ పోర్టర్స్‌కు విక్రయించినట్టు నిందితుడు పోలీసుల విచారణలో అంగీకరించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. పూజారిని అరెస్టు చేసి, అతని ఫోను, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేపట్టారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్