తెలంగాణ : “నేనే హత్య చేశాను” అంటూ వైష్ణవి సోదరుడు సంతోష్ పోలీసులకు లొంగిపోయాడు. జగిత్యాల జిల్లాకు చెందిన యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు బయటకు వచ్చాయి. “నేనే హత్య చేశాను” అంటూ వైష్ణవి సోదరుడు సంతోష్ పోలీసులకు లొంగిపోయాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. “నా చెల్లెను చంపినందుకు చంపేశా. నేను పోలీస్ స్టేషన్‌లో లొంగిపోతున్నా. మా ఇంట్లో జరిగినట్లు ఏ ఇంట్లోనూ జరగవద్దని చంపాను. నేను ఓ పనినిమిత్తం నిజామాబాద్ వచ్చా. అనుకోకుండా హరిబాబు కనిపించడంతో హత్య చేశా.” అని కీలక విషయాలను వీడియోలో పంచుకున్నాడు.
'నేనే హత్య చేశా` : వైష్ణవి సోదరుడు
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 18, 2026, 12:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)