గురువారం, 03 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కొండా సురేఖ బర్తరఫ్‌

1 గంట క్రితం

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్‌ అయ్యారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. తక్షణమే మంత్రి కొండా సురేఖను  తొలగిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 03, 2026, 03:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

* మంత్రివర్గం నుంచి తొలగిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం


హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్‌ అయ్యారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. తక్షణమే మంత్రి కొండా సురేఖను తొలగిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారిక సిఫార్సును ఇప్పటికే రాష్ట్ర గవర్నర్‌కు పంపినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది.


దీనితో పాటు పలు కీలక నామినేటెడ్ పదవుల్లో ప్రభుత్వం మార్పులు, నియామకాలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ జి. చిన్నారెడ్డి నియామకాన్ని తక్షణమే రద్దు చేయడంతో పాటు చిన్నారెడ్డి స్థానంలో గద్వాల్ విజయలక్ష్మిని ప్రణాళికా సంఘం నూతన ఉపాధ్యక్షురాలిగా నియమించారు. కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) చైర్‌పర్సన్‌గా మాజీ రాజ్యసభ సభ్యురాలు జి. సుధారాణిని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నెరేళ్ల శారదను నియమించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్