గురువారం, 03 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పింఛన్లపై రభస

1 గంట క్రితం

ycp vs tdp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 03, 2026, 01:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఎమ్మెల్యే, జడ్పిటిసి పరస్పరం తోపులాట

ప్రజాశక్తి-శ్రీకాకుళం ప్రతినిధి : సామాజిక భద్రత పింఛన్లపై జడ్పీలో సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వైసీపీకి చెందిన వారి పింఛన్లు తొలగిస్తున్నారు అంటూ పోలాకి జెడ్పిటిసి ధర్మాన కృష్ణ చైతన్య సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ కోటమీ ప్రభుత్వంలో ఒక్క పింఛను తొలగించలేదన్నారు. వైసిపి హయాంలోనే లక్షల పింఛన్ల తీసేసారని కౌంటర్ ఇచ్చారు. పింఛన్లు తలగంపై తమ వద్ద ఆధారాలున్నాయి చూడాలంటూ ఎమ్మెల్యే కూన రవి కుమార్ సీటు దగ్గరకు వచ్చారు. ''నీవేమీ చూపించాల్సిన అవసరం లేదని, నీ సీట్ దగ్గరకు నీవు వెళ్లాలంటూ'' తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో పలువురు జడ్పిటిసిలు ఎమ్మెల్యే కూన రవికుమార్ ను చుట్టుమట్టారు. మాటా మాటా పెరగడంతో ఎమ్మెల్యే కూన రవికుమార్ వైపు ధర్మాన కృష్ణ దూసుకు వచ్చారు. ఇరువురి మధ్య తోపులాట చోటుచేసుకుంది. తోటి జడ్పిటిసిలు అడ్డుకున్న తర్వాత ధర్మాన కృష్ణ చైతన్య డిఆర్డిఏ పిడి కిరణ్ కుమార్ తో వాగ్వాదానికి దిగారు. జడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ జోక్యం చేసుకోవడంతో ధర్మాన కృష్ణ చైతన్య తన సీట్ లో వెళ్లి కూర్చున్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్