హైదరాబాద్ : స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో .... బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సస్పెండ్ చేశారు. వర్షాకాల సమావేశాలు మొత్తానికిగాను వారిపై సస్పెన్షన్ విధించింది. తాతా మధు, నవీన్ రెడ్డిలపై చర్యలకు సిఫారసు చేస్తూ శాసనసభ పంపిన తీర్మానాన్ని మండలి చైర్మన్ స్వీకరించారు. అనంతరం వారిని సస్పెండ్ చేయాలని కోరుతూ మండలిలో మంత్రి శ్రీధర్‌బాబు తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై మూజువాణి పద్ధతిలో ఓటింగ్ నిర్వహించిన చైర్మన్.. ఈ సెషన్ మొత్తానికి ఇద్దరు ఎమ్మెల్సీలపై సస్పెన్షన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు, గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ .... గతంలో బిఆర్‌ఎస్ సభ్యులు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డి, శంభీపూర్ రాజు, ఇతరులు సభలో సభ్యులకు ఇచ్చిన పుస్తకాలను చించి తనపై విసిరారని, ఆ సమయంలో తాను హుందాగా ప్రవర్తించి వారిపై చర్యలు చేపట్టలేదని గుర్తు చేశారు. కాగా అసెంబ్లీ, మండలిలో ఎలాంటి భాష వాడాలో చర్చించేందుకు ప్రత్యేకంగా సభ పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా .... మండలిలో ఇద్దరు ఎమ్మెల్సీల సస్పెన్షన్‌ను బిఆర్‌ఎస్ సభ్యులు ఖండించారు. చర్చకు అవకాశం లేకుండా ఏకపక్షంగా, చట్ట విరుద్ధంగా సస్పెండ్ చేశారంటూ మండలి ఆవరణలో బైఠాయించి నిరసన తెలిపారు. తాతా మధు, నవీన్‌కుమార్‌పై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ఆ పార్టీ ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్, శంభీపూర్ రాజు తదితరులు డిమాండ్ చేశారు. కాగా ... మండలి మీడియా పాయింట్ వద్ద తాతా మధు మాట్లాడుతుండగా మార్షల్స్ అడ్డుకున్నారు. సస్పెన్షన్ వేటు పడిన కారణంగా.. ఈ ప్రాంగణంలో మాట్లాడొద్దని తెలిపారు. తాతా మధును అదుపులోకి తీసుకొని వ్యాన్‌లో తరలించారు.
తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డి పై సస్పెన్షన్ వేటు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 09, 2026, 09:12 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)