మంగళవారం, 11 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆర్టీసీ డిపోలో విషాదం - డ్రైవర్ నిర్లక్ష్యంతో మెకానిక్‌ మృతి

2 గంటల క్రితం

Tragedy at RTC Depot – Mechanic Dies Due to Driver's Negligence
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 11, 2026, 09:05 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

తెలంగాణ : హైదరాబాద్ జీడిమెట్ల ఆర్టీసీ డిపోలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు కింద పడి మెకానిక్‌ సంతోష్‌ మృతి చెందాడు. డ్రైవర్‌ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. బస్సు వద్ద మెకానిక్‌ సంతోష్‌ విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంతోష్‌ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్