మంగళవారం, 11 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

యువతి హత్య.. నిందితుడి ఆత్మహత్యాయత్నం

2 గంటల క్రితం

lovers suicide attempt
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 11, 2026, 10:20 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం ప్రతినిధి : రాజమహేంద్రవరంలో యువతి హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. అనంతరం నిందితుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనపై రాజమహేంద్రవరం త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో Cr.No.369/2026 కింద BNS సెక్షన్ 103(1) ప్రకారం కేసు నమోదైంది.పోలీసుల వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి 11.05 గంటల సమయంలో కాతేరు నుంచి ఫోర్త్ బ్రిడ్జి వైపు వెళ్లే సర్వీస్ రహదారి వద్ద ఓ మహిళ మృతదేహం పడి ఉండటంతో పాటు, తీవ్ర గాయాలతో ఓ వ్యక్తి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నట్లు NHAI హైవే పెట్రోల్ సిబ్బంది డయల్ 112కు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలు రాజమహేంద్రవరం శాంతినగర్‌కు చెందిన వరదా ప్రసన్న అలియాస్ మధు (21)గా గుర్తించారు. నిందితుడిగా కోటిలింగాలపేటకు చెందిన కుసుమ అభిలాష్ (21)ను పోలీసులు గుర్తించారు. వీరిద్దరికీ గతంలో పరిచయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. సోమవారం రాత్రి 8.30 గంటల తర్వాత ఇద్దరూ సంఘటనా స్థలానికి వచ్చినట్లు తెలుస్తోంది. అక్కడ అభిలాష్ కత్తితో ప్రసన్న మెడపై తీవ్రంగా దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అభిలాష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించినట్లు పేర్కొన్నారు.తీవ్ర అస్వస్థతకు గురైన అభిలాష్‌ను పోలీసులు తొలుత రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మెట్‌సేఫ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.ఘటనకు దారితీసిన కారణాలు, హత్యకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్