ప్రజాశక్తి-చంద్రగిరి (తిరుపతి) : భాకరాపేట ఘాట్లో కోళ్ల లారీ బోల్తాపడటంతో కోళ్ల కోసం జనం ఎగబడిన ఘటన సోమవారం అర్థరాత్రి తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం, భాకరాపేట ఘాట్ రోడ్డులో జరిగింది. నిన్న అర్థరాత్రి భాకరాపేట నుంచి తిరుపతికి వెళుతున్న కోళ్ల లారీ అదుపుతప్పి పల్టీ కొట్టడంతో బ్రాయిలర్ కోళ్లన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, వాహనదారులు అక్కడికి చేరుకుని కోళ్లను పట్టుకెళ్లారు. డ్రైవర్ స్థానికుల సహాయంతో లారీని అక్కడి నుంచి తరలించారు. పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.
పల్టీకొట్టిన లారీ.. కోళ్ల కోసం ఎగబడిన జనం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 11, 2026, 10:35 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)