మంగళవారం, 11 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Viral Video - వరద బీభత్సం - సెకన్లలో కొట్టుకుపోయిన భారీ స్టీల్ బ్రిడ్జీ..!

1 గంట క్రితం

Flood Havoc – Massive Steel Bridge Swept Away in Seconds!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 11, 2026, 10:23 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఉత్తరాఖండ్ : ఉత్తరాఖండ్ లో వరద బీభత్సం తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తోంది. కొండచరియలను కోసుకుంటూ.. పెద్ద పెద్ద రాతి గుండ్లను మోసుకొస్తున్న.. వరదనీటి ప్రకోపం చూస్తే చిన్నపాటి వణుకు పుట్టక మానదు. నీతి లోయ ప్రాంతంలో అతిపెద్ద స్టీల్ బ్రిడ్జీ కేవలం సెకన్లలో.. రెప్పపాటులో కొట్టుకుపోయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారీ వర్షాల కారణంగా నీటి ప్రవాహం పెరిగి నదులు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. బ్రిడ్జీ కొట్టుకుపోతున్న వీడియోను ఒక వాహనదారుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. బ్రిడ్జీ కొట్టుకుపోవడంతో మెయిన్ టౌన్ కు రాకపోకలు కట్ అయిపోయాయి. బ్రిడ్జీ కొట్టుకుపోవడంతో.. ఆ రూట్లో ప్రయాణించవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారీగా వరదలు వస్తున్న కారణంగా ప్రజలు ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. నదీ ప్రవాహ ప్రాంతాలలో.. కొండలకు దగ్గర్లో ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. అవసరం అనుకుంటే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. 2026 ఆగస్టు 9 రాత్రి నుంచి ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు వస్తున్నాయని డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్రెటరీ వినోద్ కుమార్ సుమన్ తెలిపారు. డెహ్రాడూన్, బాగేశ్వర్, నైనిటాల్, చంపావత్ ప్రాంతాలు వరదలకు తీవ్ర ప్రభావం చెందినట్లు చెప్పారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్