తెలంగాణ : హైదరాబాద్ శివారు శంషాబాద్‌లోని ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. కిషన్‌గూడలోని సెవెన్‌హిల్స్ ప్రైవేటు ట్రావెల్స్ సంస్థకు చెందిన ఓ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి కంటైనర్‌ను తప్పించబోయి.. పక్కనే ఉన్న బాలాజీ భవన్ హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో హోటల్‌లో టీ తాగుతున్న వ్యక్తి మృతి చెందాడు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. మృతుడిని కరీంనగర్ వాసి అజ్మల్‌గా గుర్తించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో మూడు కార్లు ధ్వంసమయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ట్రావెల్స్ బస్సు బీభత్సం - ఒకరు మృతి, 50 మందికి గాయాలు
34 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 14, 2026, 11:05 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)