బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనకిలీ నోట్ల కేసులో నలుగురు అరెస్ట్

21 గంటల క్రితం

నకిలీ నోట్ల కేసులో నలుగురు అరెస్ట్
- 99 కట్టల నోట్లు, వంద నకిలీ బంగారు నాణేలు స్వాధీనం
ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026, 09:35 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • 99 కట్టల నోట్లు, వంద నకిలీ బంగారు నాణేలు స్వాధీనం

ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో : ​చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ముద్రించిన నోట్లను అసలైన కరెన్సీగా నమ్మిస్తూ ప్రజలను మోసం చేస్తున్న ముఠా గుట్టును తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. మరో ఇద్దరు ప్రధాన నిందితులు ఇప్పటికే వేరే కేసులో అరెస్టయి ఉన్నారు. నిందితుల నుంచి రూ.40 లక్షలకు పైగా 99 కట్టల చిల్డ్రన్ బ్యాంక్ నోట్లు, వంద నకిలీ బంగారు నాణేలు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌‌పి అఖిల్ మహాజన్ మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తెలంగాణ మంచిర్యాల జిల్లాకు చెందిన పత్తి రాములుకు 2023 నవంబర్‌లో అత్రం పరశురామ్ పరిచయమయ్యారు. పూజలు, మంత్రతంత్రాలతో డబ్బులు రెట్టింపు చేస్తానని నమ్మించి రూ.6.50 లక్షలు ఇస్తే రూ.13 లక్షలు తిరిగి ఇస్తానని ఆశ చూపించారు. దీంతో, రాములు 2023 నవంబర్ పదిన ‌శ్యాంపూర్ గ్రామ శివారులో రూ.6.50 లక్షలు పరశురామ్‌‌కు ఇచ్చారు. అనంతరం పూజలు చేసి డబ్బులు రెట్టింపు అయ్యాయని చెబుతూ ఒక బ్యాగును అందించి పది రోజుల తర్వాత తెరవాలని సూచించాడు. బ్యాగులో అసలు కరెన్సీకి బదులుగా చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ముద్రించిన నోట్లు, తెల్ల కాగితాలు కనిపించాయి. మళ్లీ బాధితుడిని నమ్మించిన పరశురామ్‌ ఇంటి శుద్ధి పూజల పేరుతో మరో రూ.1.50 లక్షలు వసూలు చేశాడు. ఇలా మొత్తం రూ.8 లక్షలు తీసుకొని మోసం చే‌యడంతో బాధితుడు రాములు నవంబర్ 22న ఉట్నూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పరశురామ్‌‌తో పాటు మండలి బక్కన్న... పూజలు, మంత్రతంత్రాల పేరుతో ప్రజలను నమ్మించి డబ్బులు వసూలు చేసేవారు. వారికి సహకరిస్తున్న నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం చెన్నూరుకు చెందిన ఎంబడి మల్లేష్, మంచిర్యాల జిల్లా జన్నారం మండలానికి చెందిన చీటి తరుణ్, ఇదే మండలం పొన్కల్ గ్రామానికి చెందిన జమల్‌పూర్ సాయికృష్ణ అలియాస్ సాయి, జన్నారం గ్రామానికి చెందిన పేంద్రం సురేష్‌‌లను అరెస్టు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్