బుధవారం, 01 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమావిగన్‌ ఎజెండాతో ఎన్నికలకు..

1 గంట క్రితం

jagan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 02, 2026, 12:27 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • వైసిపి అధ్యక్షులు జగన్‌‌

  • రాష్ట్రంలో ‘రూల్‌ ఆఫ్‌ ఫియర్‌’

  • పోలీసు దుర్మార్గాలకు సాయికృష్ణ, క్రాంతికుమార్‌ కేసులే ఉదాహరణ

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : వచ్చే ఎన్నికల్లో మావిగన్‌ ఎజెండాతో ఎన్నికలకు వెళతామని వైసిపి అధ్యక్షులు జగన్‌‌మోహన్‌‌రెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు అంశాలపై ఆయన మాట్లాడారు. తాము ‘మావిగన్‌’ రాజధానికే కట్టుబడి ఉన్నామని, ‘మావిగన్‌ వర్సెస్‌ అమరావతి’ అంశంపైనే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు వెళతామని అన్నారు. అమరావతికి మేము వ్యతిరేకం కాదని, దాని నిర్మాణంలో అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగానే గట్టిగా మాట్లాడుతున్నామని తెలిపారు. అమరావతి రైతుల సమస్యలపై పోరాడుతున్నామని, ఎప్పుడైనా రైతుల పక్షపాతిగానే ఉంటామని అన్నారు. రాష్ట్రంలో ‘రూల్‌ ఆఫ్‌ ఫియర్‌’ రాజ్యమేలుతోందని అన్నారు. ధర్మం, న్యాయం పూర్తిగా గాడి తప్పాయని, దోపిడీ, అవినీతి, దుర్మార్గ పాలన సాగుతోందని విమర్శించారు. ఎవరు ప్రశ్నించినా దారుణంగా అణచివేస్తున్నారని, విజయవాడలో సాయికృష్ణ, క్రాంతికుమార్‌, కర్నూలు జిల్లాలో లాకప్‌ డెత్‌‌కు గురైన దళిత మహిళ గంగమ్మ, తెనాలిలో తిరుపతమ్మ, సంతకవిటికి చెందిన కళావతి ఘటనలన్నీ ప్రభుత్వ, పోలీసు దుర్మార్గాలకు అద్దం పడుతున్నాయని తెలిపారు. సాయికృష్ణను అక్రమంగా అరెస్టు చేసి కస్టడీలో దారుణంగా హింసించారని, కొట్టి చంపి, చివరకు మృతదేహాన్ని బూడిద చేశారని తెలిపారు. పార్టీ అధ్యక్షుడిగా తను ఆ కుటుంబాన్ని పరామర్శించిన తరవాతే ఎఫ్‌ఐఆర్‌ ‌కట్టారని అన్నారు. ఇన్ని ఘోరాల మధ్య రాముడే ఈ రాష్ట్రాన్ని కాపాడాలని అన్నారు. రైతులు కష్టాల పాలవుతున్నారని, విత్తనాలు, యూరియా కొరత వేధిస్తోందని తెలిపారు. ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదని, కష్టాల్లో ఆక్వా రంగం నష్టాల బాటలో ఉందని అన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో వైసిపి సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని, అధికారులకు స్వయంగా మంత్రుల ఫోన్లు చేసి మై టిడిపి యాప్‌ ‌చూడాలని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో దోపిడీ, అవినీతి, దుర్మార్గపు పాలనతో పాటు, సూపర్‌ సిక్సులు, సూపర్‌ సెవెన్లపై ప్రతిపక్ష పార్టీ, సోషల్‌ మీడియా యాక్టివిస్టులు, జర్నలిస్టులు ఎవరు ప్రశ్నించినా వేధిస్తున్నారని తెలిపారు. తాను రౌడీలకు మద్దతు ఇచ్చానని ప్రచారం చేస్తున్నారని, మరి చంద్రబాబు ఎందుకు సాయికృష్ణ కుటుంబ సభ్యులను కలిశారని ప్రశ్నించారు. రౌడీలను చంపుతామని ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేస్తుందా అనేది స్పష్టం చేయాలన్నారు. నిజమైన జంగిల్‌‌రాజ్‌ బీహార్లో కాదని ఎపిలో ఉందని అన్నారు. అమరావతిని చూసేందుకు వెళుతున్న వైసిపి మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలపై దాడిచేసి కొట్టిందిగాక వారిపైనే కేసులు పెడుతున్నారని అన్నారు. అమరావతికి భూములివ్వని వారిని భూసేకరణ నోటీసులు పేరుతో వేధించడం, వారి పొలాలకు వెళ్లే మార్గాలను ధ్వంసం చేయడం, అక్రమంగా మట్టి తవ్వి దోపిడీ చేయడం వంటి దారుణాలకు పాల్పడుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కడుతున్న ఆఫీసులు, ఉద్యోగుల క్వార్టర్లకు చదరపు అడుగుకు రూ.4,645 ఖర్చవుతుంటే అమరావతి కొత్త సెక్రటేరియట్‌ నిర్మాణానికి అడుగుకు రూ.20,439 ఖర్చు చేస్తున్నారని తెలిపారు. నేషనల్‌ హైవే నిర్మాణం కిలోమీటరుకు రూ.24 కోట్లు అవుతుందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పార్లమెంట్లో చెప్పారని, అమరావతిలో కిలోమీటరు రోడ్డుకు రూ.53 కోట్లు ఖర్చు చేస్తున్నారని అన్నారు. అవినీతిని పక్కదారి పట్టించేందుకు కులాలు, మతాల పేరు చెప్పి రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నారని అన్నారు. ప్రభుత్వంలో ఉన్నవారు, పదవుల్లో ఉన్నవాళ్లు, దళితులను, దళిత క్రై స్తవులతో సహా ఇతర కులాలను టార్గెట్‌ చేస్తూ అన్యాయంగా, అవమానకరంగా మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రి వాటిని ప్రోత్సహిస్తున్నారని అన్నారు. దళిత క్రై స్తవులకు రిజర్వేషన్‌ విషయంలో టిడిపి స్టాండ్‌ ఏమిటో చెప్పాలన్నారు. మెగా డిఎస్‌‌సిలో అక్రమాలు జరగలేదని నిరూపించాలని డిమాండ్‌ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్