బుధవారం, 01 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition20 నుండి సభాసమరం !

1 గంట క్రితం

parlament.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 02, 2026, 12:34 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • 3 వారాల పాటు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు​

న్యూఢిల్లీ : పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జులై 20 నుండి ప్రారంభం కానున్నాయి. మూడువారాల పాటు సమావేశాలు కొనసాగనున్నాయని పార్లమెంట్‌ ‌శ్రేణులు బుధవారం తెలిపాయి. అయితే, పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సిసిపిఎ) తుది నిర్ణయం ప్రకటించాల్సి వుంది. సాధారణంగా వర్షాకాల, శీతాకాల సమావేశాలు నాలుగువారాల పాటు సాగుతాయి. పశ్చిమ బెంగాల్‌, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి గెలిచిన అనంతరం టిఎంసి, శివసేన (యుబిటి) పార్టీ ఎంపిలు తిరుగుబాటు చేశారు. ఈ అంతర్గత తిరుగుబాటు వ్యవహారాలు కూడా చర్చకు రానున్నాయి. తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలంటూ 20 మంది టిఎంసి, ఆరుగురు శివసేన (యుబిటి) ఎంపిలు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కోరారు. దీనిపై స్పీకర్‌ ‌నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు, కేంద్ర మంత్రి వర్గంలో మార్పులుంటాయని ప్రచారం సాగుతుంది. అలాగే, మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డి లిమిటేషన్‌ ‌బిల్లు ప్రవేశపెట్టేం దుకు కొత్త ముసాయిదాను సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. అయితే, జనాభా ప్రాతిపదికన స్థానాలను పెంచడంపై దక్షిణాది పార్టీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్