ప్రజాశక్తి కారంపూడి (గుంటూరు జిల్లా) : పల్నాడు జిల్లా కారంపూడి మండలం పేట సన్నిగండ్ల గ్రామ శివారులో ఉన్న శ్రీ చక్ర సిమెంట్ ఫ్యాక్టరీని యాజమాన్యం హఠాత్తుగా లాకౌట్ ప్రకటించింది. సంస్థలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులు, కార్మికులను గురువారం నుండి విధుల్లోకి రావద్దంటూ యాజమాన్యం హుకుం జారీ చేసింది. ముందస్తు నోటీసు ఇవ్వకుండా, సోషల్ మీడియా ద్వారా సమాచారం అందించి.. ఫ్యాక్టరీ ప్రధాన గోడకు లాకౌట్ నోటీసు అంటించింది "ఇదే మీకు ఆఖరి నోటీసు.. ఒక నెల జీతం ఇస్తాం, అది పట్టుకుని వెళ్ళిపోండి" అంటూ సిబ్బందిని బలవంతంగా ఫ్యాక్టరీ నుండి బయటకు గెంటివేయడం కలకలం రేపింది. ఉపాధి నిమిత్తం వేర్వేరు ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడే జీవనం సాగిస్తున్న తమను ఉన్నఫలంగా రోడ్డున పడేస్తే తమకు దిక్కెవరంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా ఎలాంటి బోనస్‌లు, ఇంక్రిమెంట్లు లేకపోయినా.. సంస్థ అభివృద్ధి కోసం రాత్రింబవళ్లు శ్రమించామని, అలాంటిది తమను అన్యాయంగా తొలగించడం దుర్మార్గమని కార్మికులు మొరపెట్టుకున్నారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని, న్యాయం చేయాలని కోరారు.
Print Edition‘శ్రీచక్ర’ లాకౌట్
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 02, 2026, 12:16 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)