బుధవారం, 01 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionత్వరలో తల్లికి వందనం

2 గంటల క్రితం

ap cm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 02, 2026, 12:29 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఇంటికో పార్రిశామికవేత్తను తయారు చేస్తాం

  • గూడూరులో మెగా ఫర్నిచర్ పార్కు

  • నెల్లూరు జిల్లా చిల్లకూరు సభలో సిఎం చంద్రబాబు

ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి : త్వరలో తల్లికి వందనం పథకం కింద విద్యార్ధుల తల్లిదండ్రుల ఖాతాలో నగదు జమ చేయనున్నట్లు సిఎం చంద్రబాబు తెలిపారు. ఇంటికో పార్రిశామికవేత్తను తయారు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇప్పటికే గూడూరు ప్రాంతంలో 27 మెగా పరిశ్రమలు వచ్చాయని, రూ. పది వేల కోట్లతో మెగా ఫర్నిచర్ పార్కు కూడా ఏర్పాటు కాబోతోందని తెలిపారు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం పున్నపువారి పాళెంలో జరిగిన ప్రజావేదిక కార్యక్రమంలో సిఎం పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని ఎస్‌‌సి కాలనీలో ఎన్ టిఆర్ భరోసా పింఛన్‌ పంపిణీ చేశారు. అంతకు ముందు జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ... రాష్ర్టంలో ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోయినా పింఛన్‌, తల్లికి వందనం, మూడు గ్యాస్‌‌లు, ఉచిత బస్సుతోపాటు అన్ని పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.2712 కోట్లతో 62 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నామన్నారు. 2029 నాటికి పేదలు, ధనికులు అనే తేడా లేకుండా సంపద సృష్టిస్తానని, అదే తన లక్ష్యమన్నారు. పి4, బంగారు కుటుంబాల్లో పది లక్షల మంది ఉన్నారన్నారు. పొదుపు ఉద్యమంలో దేశంలోనే రాష్ర్టం ప్రథమ స్థానంలో ఉందని చెప్పారు. దేశానికి ఇక్కడి మహిళలు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. అందుకే బ్యాంకులు పెద్ద ఎత్తున మహిళలకు రుణాలిచ్చి ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు. రాష్ర్టంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతతో విశాఖపట్నం, అమరావతి, తిరుపతి మూడు రీజయన్లలో అభివృద్ధి ప్రణాళికలు తయారుచేసి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సంపద సృష్టిలో నెల్లూరు జిల్లా దేశంలోనే అగ్రగామి జిల్లాగా మారబోతోందన్నారు. ఇప్పటికే కృష్ణపట్నం పోర్టు ఉండగా, రామాయపట్నం సిద్ధమవుతోందని, త్వరలో దుగరాజుపట్నం పోర్టులు రానున్నాయని చెప్పారు. దీంతో ఇక్కడ అనేక పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. రామాయపట్నం వద్ద బిపిసిఎల్ రూ. లక్ష కోట్లతో రిఫైనరీ ఏర్పాటు చేస్తోందని, ఇఫ్కో కిసాన్ సెజ్‌లో కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు రాబోతున్నాయని తెలిపారు. దేశానికి వచ్చే పర్రిశమలు ఎక్కువ భాగం ఆంధ్రాకు వస్తున్నాయన్నారు. గురువారం కడపలో స్టీల్‌ ప్లాంట్‌‌కు శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. 2028కు ఈ ప్లాంట్‌‌ను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ సభలో జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి ఎన్ఎండి ఫరూక్, మంత్రి పి. నారాయణ, ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్