ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విజయవాడలోని రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లో లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎపిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు జె.డి. శీలం, మస్తాన్ వలీలు ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎపిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు జె.డి. శీలం మాట్లాడుతూ.. దేశంలో సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ, యువత, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటం దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కొలనుకొండ శివాజీ, షేక్ ఖుర్షిదా, గడ్డం పాల్ విజయకుమార్, బొర్రా కిరణ్, నరహరశెట్టి నరసింహారావు, అన్సారీ, పీటర్ జోసెఫ్, అల్లం రాజేష్ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)