గురువారం, 02 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

తెలంగాణ రక్ష‍ణ సేన పార్టీ అధ్యక్ష‍ురాలు కె.కవిత అరెస్ట్‌

3 గంటల క్రితం

Kavitha arrested
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 02, 2026, 04:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్‌ : తెలంగాణ రక్ష‍ణ సేన పార్టీ అధ్యక్ష‍ురాలు కె.కవితను గురువారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ అనంతరం ఆమెను బొల్లారం పిఎస్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. వివరాల ప్రకారం.. ఉప్పల్‌ భగాయత్‌ పరిధిలో తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ కవిత నిరసన చేపట్టారు. బోడుప్పల్‌లో ఉద్యమకారులతో కలిసి ఆమె ఆందోళనకు దిగారు. అయితే నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. నిరసనకారుల మధ్య తోపులాట జరగడంతో ఆమెకు స్వల్పగాయాలయ్యాయి. అక్కడికి చేరుకున్న పోలీసులు ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ టెంట్లను తొలగించారు. అనంతరం కవిత సహా అక్కడున్న వారందరినీ అరెస్ట్‌ చేసి, బొల్లారం పిఎస్‌కు తరలించారు. పిఎస్‌కు భారీగా చేరుకున్న ఆమె మద్దతుదారులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్